Breaking News

ఇబ్రహీంపట్నం

ఇంటింటా తీరని విషాదగాథ

ఇంటింటా తీరని విషాదగాథ

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో ఆపరేషన్​ వికటించి నలుగురి మృతి అసలే పేద కుటుంబాలు.. అంతులేని దు:ఖం మహిళల కుటుంబాలను పరామర్శించిన బీఎస్పీ నేతలు రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా, రెండెకరా భూమి ఇవ్వాలని డిమాండ్​ సామాజికసారథి, ఇబ్రహీంపట్నం: అసలే పేద కుటుంబాలు.. కూలీ పనికిపోతేనే కడుపునిండేది. అలాంటి మహిళలను మాయదారి ఆపరేషన్ పొట్టనపెట్టుకున్నది. చనిపోయిన నలుగురిలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. వారి పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో […]

Read More
వరుణ దేవుడికి అభిషేకం

వరుణ దేవుడికి అభిషేకం

సామాజిక సారథి, తుర్కయంజాల్: ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో వరుణదేవుడికి అర్చన, అభిషేక మహోత్సవాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్​యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్​పర్సన్​తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే జి.జైపాల్​యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య, రైతుసంఘం అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కన్నడ ముత్యంరెడ్డి, బ్యాంకు డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చెవుల దశరథ, 12వ […]

Read More
చిన్నారెడ్డి గెలుపు ఖాయం

చిన్నారెడ్డి గెలుపు ఖాయం

సారథి న్యూస్​, యాచారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలువుకోసం విశేషంగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కృష్ణాజలాల సాధనకు సీపీఎంతో కలిసి పోరాడి సాధించామని గుర్తుచేశారు. జడ్పీటీసీ నిత్యా నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా మృతి

ఒరిగిన పోరు కెరటం

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా ఇకలేరు శానససభలో ప్రజల తరఫున తనదైన గళం చివరి శ్వాసదాకా ప్రజా ఉద్యమాల్లోనే.. నిజాయితీయే ఆస్తి సారథి న్యూస్​, ఇబ్రహీంపట్నం: పోరు కెరటం నెలకొరిగింది.. ప్రజాగొంతుక మూగబోయింది.. దళిత కిరణం ఆరిపోయింది.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహా ఇక లేరు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. […]

Read More

హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ

సారథి న్యూస్, ఇబ్రహీంపట్నం: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లో మొక్కలు నాటి ప్రారంభించారు. తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్,వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Read More