సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో మే చివరి దాకా రాత్రిపూట కర్ఫ్యూతో కొన్ని నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. జూన్ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు 8వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, పాఠశాలలు మినహా షాపింగ్ మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో వ్యాపారాలు, క్రయ విక్రయాలు క్రమక్రమంగా ఊపందుకుంటాయని అందరూ భావించారు. తద్వారా పన్నుల రూపంలో ఖజానాకు రాబడి ప్రారంభమవుతుందనీ, ఈనెల చివరి […]
ఇండియాలో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కరోనా తల్లడిల్లుతున్న జనాలను కాపాడాల్సిన సర్కారు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి పదును పెట్టింది. ఇప్పటికే పనులు లేక ఆదాయం రాక అవస్థలు పడుతున్న జనంపై పెట్రోలియంపై పన్నులు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా చేసింది. దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవితాలను కూడా దుర్భరం చేసింది. రెండు నెలలకు పైగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో చిరు […]