Breaking News

అసెంబ్లీ సమావేశాలు

మంత్రి హరీశ్​రావుకు కరోనా పాజిటివ్​

మంత్రి హరీశ్​రావుకు కరోనా పాజిటివ్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను విడిచిపెట్టడం లేదు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు చేరిపోయారు. తనకు కోవిడ్​19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్​గా తేలిందని, గత కొన్నిరోజుల నుంచి తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్​లో ఉండాలని ఈ మేరకు ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యవంతంగానే ఉన్నానని తెలిపారు.కాగా, ఇదివరకే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఈనెల […]

Read More
పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయని, కోవిడ్ ​పాజిటివ్​గా నిర్ధారణ అయిన వారు ఎవరైనాసరే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి సూచించారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఏలు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, ​ఉన్నతాధికారులు, […]

Read More
ప్రజాసమస్యలపై సంపూర్ణంగా చర్చిద్దాం

ప్రజాసమస్యలపై సంపూర్ణంగా చర్చిద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్నిఅంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయపక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈనెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ మంత్రులు, విప్ లతో గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.మంత్రులు సన్నద్ధమై రావాలికరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో […]

Read More
సెప్టెంబర్​ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్​ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో ఆయన పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 20రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ద్వారా పలు అంశాలపై సమగ్రచర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా […]

Read More