సారథి న్యూస్, మెదక్: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందువులే కాదు ముస్లింలు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు విరాళాలు అందజేయడం విశేషం. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహమ్మద్, అక్రం, ఖదీర్, ఇసాక్, మహమ్మద్ సమీర్, మౌలానా, హర్షద్, అహమ్మద్, ఇమ్రాన్, రామమందిర నిర్మాణ తీర్థ ట్రస్ట్ […]