సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీరణాన్నీ 33 శాతానికి పెంచాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వనాన్ని తలపించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రామడుగు తహసీల్దార్ చింతల కోమల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్రావు, వివిధ […]
కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలోకి 15 అడుగుల భారీ తాచుపాము వచ్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని కొందరు యువకులు ఆ పామును చంపేందుకు యత్నించగా వారికి చిక్కలేదు. దీంతో అటవీఅధికారులను సమాచారమిచ్చారు. అధికారులు గ్రామానికి చేరుకొని ఆ పామును సజీవంగా బంధించారు. అనంతరం సమీపంలోని సిరువాని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
సారథి న్యూస్, రామడుగు: ప్రతి మండలంలోనూ మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శానగర్ లోని లక్ష్మీ గార్డెన్ లో ఆరో విడత హరితహారంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచాలనే ఉద్దేశ్యంతో హరితహారం చేపట్టామని తెలిపారు. చెట్ల పెంపకం వల్ల పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో […]