సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీ వరకు దస్తావేజు సేవలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులరాజు తెలిపారు. భూ విక్రయ కొనుగోలుదారులు, ప్రజలు సహకరించగలరని కోరారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
ఆస్పత్రిపై కేసు నమోదు సారథి, వేములవాడ: కరోనా టెస్టుల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ కొవిడ్ ఆస్పత్రిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపారు. పోలీసుల కథనం.. చిట్టి మంగమ్మ అనే మహిళ స్వల్ప జ్వరం లక్షణాలతో మాతృశ్రీ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సీటీస్కాన్, రక్తపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని ఆమెకు సూచించారు. సుమారు రూ.1.5లక్షలు […]
సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుమ్మడి ప్రకాశ్ (45)అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. టీచర్ గా ప్రకాశ్ అందించిన సేవలను తోటి ఉపాధ్యాయులు, టీచర్లు కొనియాడారు.
సారథి, వేములవాడ: నూతనంగా నిర్మాణం చేపట్టే కొత్తపల్లి, మనోహరబాద్ రైల్వే బ్రాడ్ గేజ్ నిర్మాణ పనుల కోసం అణు పురం, నాంపల్లి గ్రామాల్లో ప్రజాసేకరణ కార్యక్రమం నిర్వహించారు. అణుపురంలో 15.12 ఎకరాలు, నాంపల్లిలో 47.0.7 ఎకరాలను సేకరించారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారికి గ్రామస్తులు సమ్మతి తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ తహసీల్దార్ పి.మునీందర్, నక్క శ్రీనివాసస్, తహసీల్దార్ వేములవాడ రూరల్ నరేష్ ఆనంద్, ఎంపీడీవో మ్యాకల రవి, జడ్పీటీసీ జడల శ్రీనివాస్, ఎర్రం మధు పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: వంద పడకల ఆస్పత్రి సముదాయం చుట్టూ పరిసరాలను చదును చేసి శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సోమవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రి సముదాయాన్ని పరిశీలించారు. ఐసీయూ, సాధారణ వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన పరికరాలు త్వరలోనే తీసుకొస్తామన్నారు. విద్యుత్ సదుపాయంతో సహా ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్ మహేశ్ రావు, తదితరులు ఉన్నారు.
సారథి, వేములవాడ: ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవగా చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. కొవిడ్ బాధితులకు రెమిడెసివిర్ఇంజక్షన్లు, అక్సిజన్అందించడంలో, ఆస్పత్రుల్లో బెడ్లు సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలకల […]
సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీనివాస్(45) అనారోగ్యంతో శనివారం ఉదయం కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
సారథి, వేములవాడ: జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్(143) ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. వేములవాడతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఆయన వెంట ప్రెస్క్లబ్ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఇతర జర్నలిస్టులు […]