Breaking News

వేములవాడ

అన్నదానం గొప్పకార్యం

అన్నదానం గొప్పకార్యం

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్ విధించడంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు నిత్యన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయి. నిత్యన్నదానం పై ఆధారపడి కడుపు నింపుకునే పేదలు, యాచకులు ఆకలితో విలవిల్లాడుతున్న నేపథ్యంలో శనివారం 250 మందికి జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే పండ్లు, పౌష్టికాహారం ఆహారం అందజేసి వారిని అభినందించారు. తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎవరూ […]

Read More
నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

సారథి, వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానంగా ఉన్న నాంపల్లిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన, వేదవిన్నపాలు నిర్వహించారు. తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చకస్వాములు రమణాచారి, విజయసింహచారితో పాటు పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇన్ చార్జ్ నూగురి నరేందర్ పాల్గొన్నారు.

Read More
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు

ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు

సారథి, వేములవాడ: వేములవాడ రూరల్ మండల మూలవాగు పరీవాహక ప్రాంతలైన మల్లారం, జయవరం గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలింపును రైతులు అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోయి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బావుల్లో నీళ్లు ఉంటేనే  వ్యవసాయం సాగదని రైతులు అన్నారు. అక్రమ రవాణా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఇరుగ్రామాలకు చెందిన రైతులు వెంగళరావు రవి, మల్లేశం, బాబురావు, అశోక్, వేణు, శ్రీనివాస్, నర్సయ్య, […]

Read More
రైతుల కోసం బీజేపీ దీక్ష

రైతుల కోసం బీజేపీ దీక్ష

సారథి, వేములవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం వేములవాడలో రైతుగోస తెలంగాణ పోరు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక విషయంలో మనుషులను చంపి నడిపించే లారీలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వరి ధాన్యం అమ్ముకుందామంటే లారీలను సమకూర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యాన్ని తొందరగా […]

Read More
కరోనా కిట్లు పంపిణీ

కరోనా కిట్లు పంపిణీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కరోనాతో బాధపడుతున్న వారికి ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణాభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మంగళవారం 50 కిట్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ తెలిపారు. బాధితులకు ఈ కిట్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 14 రోజులకు సరిపడా మందులు ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైనవారు శ్రీనివాస్ ఫోన్ నం.09248061 999 కు సంప్రదించాలని సూచించారు.

Read More
అభాగ్యులకు అన్నదానం

అభాగ్యులకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి రాజరాజేశ్వర దేవస్థానం వారు అన్నదానం చేశారు. వారికి మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనం పెట్టనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతిర్తపు మాధవి, ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ పర్యవేక్షకులు శ్రీరాములు, […]

Read More
గీత దాటితే చర్యలు తప్పవు: ఎస్పీ

గీత దాటితే చర్యలు తప్పవు: ఎస్పీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో వేములవాడ- తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పది గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పది షాపుల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఆయన […]

Read More
వేములవాడలో లాక్ డౌన్

వేములవాడలో లాక్ డౌన్

* రాజన్న సన్నిదిలో కొడేమొక్కులు రద్దు సారథి, వేములవాడ: శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందింది. రాజన్న ఆలయంలో కారోన వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోంది. దీంతో గురువారం నుండి రాజన్న ఆలయంలో కోడె మొక్కుబడితో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ తెలిపారు. అదే విధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి  పాలకవర్గం, అధికారులతో ఏర్పాటు చేసి అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడుతూ […]

Read More