సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ కమాండెంట్ శ్రీహరిఓం ఖరే ఆధ్వర్యంలో ఆదివారం వెంకటాపురం మండలంలోని మంగవాయ, లక్మిపురం, పాత్రపురం గ్రామాల్లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ఆఫీసర్ కమాండింగ్ ఎస్సై సీతారాం సింగ్, సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి, సీఆర్పీఎఫ్ఎస్సై అలెగ్జాండర్ డేవిడ్, ఎస్సై రాంప్రసాద్ పాల్ మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. సర్పంచ్ కృష్ణార్జునరావు, ఉపసర్పంచ్ మల్లికార్జున రావు, టీచర్ పాండా […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్పరారీలో ఉన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగాల గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అవగాహన కల్పిస్తూ డాక్టర్ యమున సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు కట్టుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వాజేడ్ మండలంలో ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాజేడ్, వెంకటాపురం మండలాల్లో 16 మందితో సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకుని వారితో పాటు వారి కుటుంబసభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు మండలం బాలలక్ష్మీపురం గ్రామంలో ఎస్సై తిరుపతిరావు బుధవారం మాస్కులు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. గ్రామంలో ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్యాసతీసుకోడం ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు హెల్త్ సెంటర్లో క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి క్షయవ్యాధి(టీబీ) నిర్ధారణ కోసం వైద్యాధికారుల బృందం తెమడను సేకరించింది. బాధితులకు వ్యాధి లక్షణాలను తెలియజేశారు. అనంతరంపై కరోనాపై జాగ్రత్తలను వివరించారు. తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఈశ్వరమ్మ, శరత్ బాబు, రవి, రజినీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.