Breaking News

రామడుగు

అభ్యుదయ రైతు భాను

అభ్యుదయ రైతు భాను

వ్యవసాయం తెలియని శ్రీమంతుడు ఎకరాకు 90 బస్తాలు వరి ధాన్యం దిగుబడి సారథి, రామడుగు: ఆయనకు వ్యవసాయమంటే పెద్దగా తెలియదు. సాగు పద్ధతులు అంతకన్నా రావు. కనీసం సాగులో అనుభవం తనకు అనుభవం లేకున్నా తలపండిన రైతులను సైతం అధిగమించి పంట అధిక దిగుబడి సాధించాడు. దీంతో అందరిచేత శ్రీమంతుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన పంజాల భానుచందర్ గౌడ్ అనే యువరైతు నూతనంగా వ్యవసాయం ప్రారంభించారు. తనకు ఉన్న వ్యవసాయ […]

Read More
యువకుడిని బలితీసుకున్న కరోనా

యువకుడిని బలితీసుకున్న కరోనా

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ యువకులను ఎక్కువగా బలి తీసుకుంటోంది. తాజాగా కరీంనగర్​జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం రాజు (34) అనే యువకుడు కరోనాతో మృతిచెందాడు. కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడికి అమ్మ నాన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. తాను పెళ్లి చేసుకోకుండా కుటుంబభారాన్ని మోస్తున్నాడు. తమ కొడుకు లేడన్న నిజాన్ని తెలుసుకుని రాజు తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తుండగా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. నీలం రాజు […]

Read More
కరోనా టెస్టులకు బారులు

కరోనా టెస్టులకు బారులు

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో అధిక మంది టెస్టులు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కరీంనగర్​జిల్లా రామడుగు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన టెస్టింగ్ సెంటర్ లో కరోనా పరీక్షల కోసం జనం బారులుదీరారు. కానీ టెస్టింగ్​ కిట్లు లేకపోవడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.

Read More
కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమం

కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమం

సారథి, రామడుగు: కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకోసం కార్మిక లోకం ఉద్యమించాలని కరీంనగర్​సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మే డే సందర్భంగా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి, రామడుగు, గుండి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట తదితర గ్రామాల్లో ఎర్రజెండా ఎగరవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతూ రైతులను వారి భూముల్లోనే పాలేర్లుగా మార్చుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల […]

Read More
రైతులకు తప్పని తిప్పలు

ప్యాడి క్లీనర్లు లేక పరేషాన్​

రైతులకు తప్పని తిప్పలు కరెంట్ వసతి కల్పించాలని డిమాండ్​ సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్ల లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొంతంగా ఎడ్ల బండ్లకు పంకలు కట్టి వడ్లు పడుతున్నారు. ట్రాక్టర్ పంకకు గంటకు రూ.వెయ్యి చొప్పున అద్దెకు తెచ్చుకుంటున్నారు. కనీసం ఉన్న రెండు ప్యాడి క్లీనర్లకు కరెంట్​సౌలత్ లేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడంతో పొలాలు, ఇళ్ల మధ్యలో […]

Read More
ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

సారథి, రామడుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తామని ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు, మచ్చలేని మంచి మనిషి ముదిరాజ్ ల ఆరాధ్యదైవం అని కొనియాడారు. […]

Read More
మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు తెలంగాణ మోడల్ స్కూలులో 2020-21 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ వనజ తెలిపారు. ఈ నెల 8 వరకు చివరి తేదీ అయినందున అర్హులైన విద్యార్థులు అప్లికేషన్ చేసుకుని సర్టిఫికెట్స్ ను స్కూలులో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు www.telangana ms.cgg.gov.in సంప్రదించాలని తెలిపారు.

Read More
కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య కరోనా బాధిత ఆరు కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసరాలు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నాడు. ఎవరు భయపడకుండా డాక్టర్లు సూచించిన మందులు వాడాలని ఆయన సూచించారు. మెడిసిన్​ వాడుతూనే పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. గోపాల్​ రావుపేట ఏఎంసీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, పంచాయతీ కార్యదర్శి శిరీష్, టీఆర్ఎస్ నాయకులు తడగొండ నర్సింబాబు, ఆశావర్కర్లు, గ్రామపంచాయతీ […]

Read More