Breaking News

మెదక్

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై […]

Read More
పంటను దళారులకు అమ్ముకోవద్దు

పంటను దళారులకు అమ్ముకోవద్దు

సారథి, రామాయంపేట: రైతులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాలని మెదక్​జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో గల సబ్ మార్కెట్ యార్డులోని వరి కొనుగోలు సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు పంటను దళారులకు […]

Read More
బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడింది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారికి ఆమె శవమై కనిపించింది. అనూషమ్మకు దుర్గమణి, సాయమ్మ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనూషమ్మ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. భర్త స్థాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
ఘనంగా శోభాయాత్ర

ఘనంగా శోభాయాత్ర

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం శివాజీ యువసేన, భజరంగ్ దళ్, వివేకానంద ఉత్సవ సమితి, శ్రీరామ్ సేన తదితర యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ‘జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్.. జై శివాజీ.. వీరభవానీ.. భారత్ మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా భారీ శోభాయాత్ర […]

Read More
టీఆర్ఎస్​సభ్యత్వ నమోదు

టీఆర్ఎస్​ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ ​జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు పట్లొరీ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలోని అంబాజీపేట, చందాపూర్ గ్రామాల్లో సభ్యత్వాలు చేయించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్​లు సాన సాయిలు, పడాల రమాదేవి, శ్రీనివాస్, టీఆర్ఎస్​ గ్రామాధ్యక్షుడు ధ్యాప బాలకిషన్, మ్యాసగల్ల పెంటయ్య, గోపాల్ నాయక్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, […]

Read More
ఆధార్ లింక్ గడువు పెంపు

ఆధార్ లింక్ గడువు పెంపు

సారథి న్యూస్, మెదక్: మొబైల్ కు ఆధార్​ నంబర్​ అనుసంధానం చేసేందుకు మీ- సేవా, ఈ-సేవా కేంద్రాలు మార్చి 31వ తేదీ వరకు రాత్రి 9గంటల వరకు పనిచేస్తాయని మెదక్​ జిల్లా కలెక్టర్ హరీశ్​ తెలిపారు. కోవిడ్-19 వాక్సిన్ వేసుకునేందుకు పేరు నమోదుకు ఆధార్ ఆధారిత మొబైల్ ఓటీపీ ఆవశ్యకత ఉన్నందున ఈ వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. మీ ఆధార్ కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం కోసం ఆధార్ కేంద్రాలతో పాటు […]

Read More
మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామశివారులో నూతనంగా ఏర్పాటుకానున్న ఓ కంపెనీకి ప్రభుత్వ అసైన్​మెంట్​ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భారతీయ కిసాన్​మోర్చా మెదక్​ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. కామారం గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి రాత్రికిరాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులతో పాటు కంపెనీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Read More
పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ డీపీవో తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శుల వివరాలను సూపరింటెండెంట్ రాజమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ చక్రధర్, సిబ్బంది తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Read More