సారథి న్యూస్, ములుగు: ఏటా జనవరి 1 నాటికి చేపట్టే స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటర్లుగా నమోదు చేసేందుకు అవగాహన కల్పించాలని, అలాగే చనిపోయినవారిని తొలగించేందుకు, మార్పులు, చేర్పులు చేయాలని ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణాఆదిత్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో లిస్టులో పేరు మాత్రమే ఉండేదని, ఇప్పుడు పేరుతో పాటు ఫొటో కూడా ఉందన్నారు. 10వ […]
సారథి న్యూస్, ములుగు: బాలల హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్జీ ఆనంద్ సూచించారు. గురువారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడారం టోర్నమెంట్ క్రీడల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో ఆటలపోటీల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం […]
సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ కాలేజీలు, ఆఫీసులు అన్ని వసతులతో పరిశుభ్రంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఎంత మంది సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, తరగతి గదుల వివరాలను జిల్లా కలెక్టర్ ఇన్చార్జ్ప్రిన్సిపాల్ కె.లక్ష్మయ్యను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను పాటిస్తూ కళాశాల […]
సారథి న్యూస్, తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను బుధవారం ఛత్తీస్ ఘడ్ మాజీ మంత్రి మహేశ్ఘగడ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆలయ పూజారులు డోలీలతో కలిసి ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ఆమె పూజలు చేశారు. కార్యక్రమంలో బీజాపూర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముడిలియర్, మండలాధ్యక్షుడు డోలేశ్ రాజ్ విర్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండలాధ్యక్షులు జాలాపు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లు […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యాలయం చుట్టూ గడ్డి పరిచి అందమైన పూలమొక్కలను నాటారు. ఆడిటోరియం చుట్టూ మొక్కలు నాటారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. నీటి ట్యాంకు, పెద్ద సంప్నిర్మాణం పూర్తయింది. వివిధ అవసరాలకు వచ్చే ప్రజానీకానికి కార్యాలయ ఆవరణలో వెయిటింగ్హాలును ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రహరీ ఎత్తు పెంచి, భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. భద్రత, […]
సారథి న్యూస్, ములుగు: సమాజ విజ్ఞానాభివృద్ధికి మూలం, దైవం కన్నా మిన్న అయిన ఉపాధ్యాయులకు ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్ లో ములుగు జిల్లా ప్రైవేట్ టీచర్లకు సర్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా […]
సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర మహిళా స్రీ,శిశు సంక్షేమ, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వెబినార్ ద్వారా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ.. వైకల్యం మనిషికి మాత్రమేనని మనసుకు కాదని, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ […]
సారథి న్యూస్, ములుగు: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోలు చేపట్టాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఆయన వెంకటాపూర్ లో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. కొనుగోలులో నిబంధనలు పాటించాలన్నారు. ప్రక్రియ నమోదు ఎప్పటికప్పుడు చేయాలని, మిల్లులకు ధాన్య రవాణాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం చూసుకుని కేంద్రాలకు తీసుకుని వచ్చేలా […]