సారథి, చొప్పదండి: కరోనా విజృంభణ.. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో పేద కుటుంబాలకు సోమవారం టీఆర్ఎస్ నాయకులు మచ్చ రమేష్, మిత్రుల సహకారంతో 25కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాళ్లపల్లి రవి, తాల్లపల్లి కరుణాకర్, దూస మురళి, దూస సతీష్, ఎనగందుల సాయికుమార్, తమ్మడి సంతోష్ పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: కరోనా మహమ్మారి రోజురోజు విజృంభిస్తున్న నేపథ్యంలో కౌలు రైతులు అనేక అవస్థలు ఎదురుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన కుక్కల రవి 15 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. వాతావరణ పరిస్థితుల అనుకులించక మామిడి కాయ సైజ్ పెరగక పోగా, ఇటీవల కురిసిన గాలివాన భీభత్సానికి చెతికొచ్చిన పంటకాస్తా నేలపాలయ్యిందని వాపోతున్నాడు. అప్పులు తెచ్చి పంటకు పురుగుల మందులు పిచికారి చేస్తే ప్రకృతి అన్నదాలపై కనికరించడంలేదన్నారు. ఇప్పటికైన కౌలు […]
సారథి, చొప్పదండి: సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న నరేంద్రమోడీ దేశం గర్వించదగిన ప్రధాని అని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ కొనియాడారు. ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చొప్పదండి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో పలు వార్డుల్లోని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, మాస్క్ లు, సానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి పట్టణ ప్రధాన కార్యదర్శులు బత్తిని […]
సారథి, చొప్పదండి: లాక్ డౌన్ లో భాగంగా మంగళవారం చొప్పదండి సీఐ కె.నాగేశ్వర్ రావు, ఎస్సై బి.వంశీకృష్ణ వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని మూడు వెహికిల్స్ ను సీజ్ చేశారు. 15 వాహనాలను ఫైన్ వేశారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి పనులు ఉన్నప్పటికీ ఉదయం 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని కోరారు.
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా రెండో డోసు వాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. భౌతికదూరం పాటించాలన్నారు. రెండు మాస్కులు ధరించాలన్నారు. వాక్సినేషన్ తొందరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు.
సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు చొప్పదండి పట్టణంలోని నవోదయ విద్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీపీవో వీరబుచ్చయ్య సోమవారం పరిశీలించారు. ఐసొలేషన్ ఏర్పాటునకు అన్నిరకాల వసతులు ఉన్నందున ఎంపిక చేసినట్లు తెలిపారు. తహసీల్దా్ర్ అంబటి రజిత, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైద్యాధికారి రమాదేవికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పనులు వెంటనే ప్రారంభించేలా ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతాయారు, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ ఇన్ […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మపూర్, కొనేరుపల్లి గ్రామాల్లో కురిసిన అకాలవర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో నష్టపోయి ధాన్యాన్ని పరిశీలించారు. వడ్లను సకాలంలో కొనుగోలు చేయడంలో మిల్లర్లు కొర్రీలు పెట్టడం ద్వారా కల్లంలోనే తడిసి ముద్దయ్యాయని, తద్వారా రైతులకు తీవ్రనష్టం కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్ కవర్లు లేకపోవడం, తాలు పేరుతో సకాలంలో కొనకపోవడంతో […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతు వేదికలో నిర్వహిస్తున్న కరోనా టెస్టింగ్ కేంద్రాలకు జనం బారులుదీరుతున్నారు. రోజు 100 మంది నుంచి 150 మంది టెస్టుల కోసం వస్తుండగా, కిట్లు మాత్రం 50 ఉంటున్నాయి. దీనితో పరీక్షల కోసం రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. రోజుకు 50 టెస్టులు చేయగా అందులో 20 నుంచి 25 వరకు పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత 25 రోజుల్లో చొప్పదండిలో 30 నుంచి 40 మంది […]