ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్‌యాదవ్ సారథి న్యూస్, కర్నూలు: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, అందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా […]
ఆర్టీవో చెక్ పోస్టు వద్ద భారీగా మద్యం పట్టివేత 588 మద్యం బాటిళ్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సెబ్ సీఐ రాజశేఖర్ గౌడ్ సారథి న్యూస్, కర్నూలు: అక్రమ మద్యం రవాణాదారులకు పలుమార్లు చెప్పినా మార్పు రావడం లేదని, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ వారి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) సీఐ రాజశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు హైవేలోని టోల్ గేట్ వద్దనున్న ఆర్టీవో చెక్‌పోస్టు వద్ద సెబ్ […]
ఫిర్యాదుచేసిన వ్యక్తికే తెలియకుండా.. కేసు నమోదు ఎస్పీని కలుస్తానన్న ఫిర్యాదుదారుడు సారథి న్యూస్, కర్నూలు: లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాస్ నాయక్ అరెస్టు వెనక రాజ‘కీ’య కారణాలు ఉన్నాయనే విమర్శలు వ్కక్తమవుతున్నాయి. జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు మండలం సుగాలితండాకు చెందిన 150 కుటుంబాలకు రుద్రవరం గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వ ఐదెకరాల చొప్పున పంపిణీ చేసింది. సర్వేనం.507‘ఏ’ లోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం రాష్ట్ర […]
సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్‌ను వాట్సప్‌ద్వారా పరిచయం చేసుకుంటారని, మిమ్మల్ని మాయమాటలతో గారడీ చేసి ఫోర్న్సైట్ల నుంచి తీసుకున్న వీడియోలతో బ్లాక్మెయిల్చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరువాత డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెడతారని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని వ్యాపారసంస్థలు రెండు నెలల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉందని, వ్యాపారుల ఆర్థికపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సమయాన్ని సాయంత్రం వరకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. వ్యాపారులు అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోగా అందులో పనిచేసే వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక తమ వ్యాపారాలను వదులుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్‌లాక్ సమయంలో పెద్ద నగరాల్లో సాయంత్రం వరకు […]
సారథి న్యూస్, కర్నూలు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఆపాలని ప్రయత్నిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని భవన నిర్మాణ కార్మిక సంఘం న్యూ సిటీ కార్యదర్శి కె.సుధాకరప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ముజఫర్ నగర్ మట్టి పని అడ్డాలో జీవోనం.17 కాపీలను మాజీ కార్పొరేటర్ బి.సోమన్న మహిళా సంఘం నాయకురాలు ఎస్.ఓబులమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కె.సుధాకరప్ప, బి.సోమన్న మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ నిధికి రూ.450 కోట్లు జమచేయాలని డిమాండ్ చేశారు. ఈనెల […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా యజమానుల పర్యవేక్షణ లేక చెత్తదిబ్బలుగా, మురుగు కుంటలుగా మారిన ఖాళీస్థలాల రూపురేఖలు మారిపోతున్నాయి. మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్థానిక బుధవారంపేటలోని హాబీబ్ ముబారక్ నగర్ లో ఓ ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో ఉండి చాలా ఏళ్లుగా చెత్తదిబ్బగా మారి ఇరుగుపొరుగు వారికి దుర్గంధం రావడంతో పాటు దోమలు, పందుల బెడదతో […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు అహర్నిశలు కృషిచేసిన వైద్యులు, స్టాఫ్‌నర్సు, సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా అభివర్ణించడానికి సంతోషిస్తున్నానని కర్నూలు మెడికల్‌కాలేజీ ప్రిన్సిపల్, ఏడీఎంఈ డాక్టర్‌చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నివారణకు మెరుగైన వైద్యసేవలు అందించారని, అందుకే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరింత మెరుగైన […]