Breaking News

కరీంనగర్

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ ​దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్వో చంద్రశేఖర్ ఆయనకు కండువా కప్పి లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
దొడ్డి కొమురయ్య స్ఫూర్తి అందరికీ ఆదర్శం

దొడ్డి కొమురయ్య స్ఫూర్తి అందరికీ ఆదర్శం

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు పెద్ది వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ట్యాంక్ బండ్ పై అమరుడి విగ్రహం లేకపోవడం విచాకరమన్నారు. దొడ్డి కొమురయ్య భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై […]

Read More
పారిశుద్ధ్యం అందరి బాధ్యత

పారిశుద్ధ్యం అందరి బాధ్యత

సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో పల్లెప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామస్తులను కోరారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ చిలుక రవిందర్, ఎంపీటీసీ తోట […]

Read More
అట్టహాసంగా డాక్టర్స్ డే

అట్టహాసంగా డాక్టర్స్ డే

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే గుండి పీహెచ్​సీలోని ఇద్దరు డాక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దురుశెట్టి మల్లేశం, సెక్రటరీ కోడీమ్యాల వేణుగోపాల్, కోశాధికారి రాంపల్లి శ్రీనివాస్, కోడీమ్యాల వెంకట్ రమణ, కర్ర శ్యాంసుందర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Read More
చాలెంజ్​గా హరితహారం

చాలెంజ్​గా హరితహారం

సారథి, రామడుగు: నాలుగో విడత హరితహారంపై మంగళవారం కరీంనగర్ ​జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారని అన్నారు. హరితహారాన్ని చాలెంజ్​గా తీసుకోవాలని సూచించారు. జడ్పీటీసీ సభ్యురాలు మారుకొండ లక్ష్మీ, ఏఎంసీ చైర్మన్ గంటల వెంకటరెడ్డి, ఎంపీడీవో ఎన్నర్ మల్హోత్ర, ఎంపీవో సతీష్ కుమార్, గుండి గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య […]

Read More
రాములపల్లిలో పల్లెనిద్ర

శ్రీరాములపల్లిలో పల్లెనిద్ర

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం మండల అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి పలు వార్డుల్లో కలియ తిరిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. స్థానికులు పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ జీవన్, ఎంపీడీవో మల్హోత్రా, ఎంపీవో సతీష్, కార్యదర్శి శ్రీకాంత్ రావు, ఎంపీటీసీ సభ్యుడు మోడీ రవి, ఏఎన్ఎం, వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
పల్లెలు ప్రగతి సాధించాలి

పల్లెలు ప్రగతి సాధించాలి

సారథి, చొప్పదండి: పల్లెలు ప్రగతి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ అన్నారు. గురువారం చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు పల్లెనిద్ర పేరున పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న పంచాయతీల ప్రగతి పర్యవేక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు. ఖాళీస్థలాల్లో విరివిగా పెంచాలని సూచించారు. రాగంపేటలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ […]

Read More
అభివృద్ధి పనులకు శ్రీకారం

అభివృద్ధి పనులకు శ్రీకారం

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్యసమావేశం చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో జరిగింది. పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు. వీటిలో రైతు విశ్రాంతి భవన నిర్మాణం, ప్రహరీపై పెయింటింగ్, పాత షెడ్ రిపేర్ చేయడం వంటి పలు అంశాలు చర్చించి వాటిని యుద్ధప్రాతిపాదికన పూర్తిచేయాలని తీర్మానించారు. అనంతరం హరితహారంలో భాగంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో […]

Read More