సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు దబ్బకట్ల లక్ష్మయ్య, రాజయ్య మాట్లాడుతూ.. రాజయ్యకు వాజేడు మండల ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు. మండల ప్రజలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించే వారని అన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి తను శాసనసభ నిధులను వెచ్చించి పనిచేసేవారని అన్నారు, వ్యవసాయ కార్మిక, రైతాంగ, పోరాటాల్లో […]
సారథి, వాజేడు: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికెల వేణు మాదిగ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేసిన […]
సారథి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం చాటుకున్నారు. ఇటీవల మరణించిన కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కైసర్ పాషా కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే గరా రాములు కుటుంబానికి రూ.రెండువేల చొప్పున సాయం చేశారు. అలాగే కరోనాతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ […]
సారథి, ఖమ్మం: కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలుతీరుపై ఆయా జిల్లాల ఎస్పీలతో వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆఫీసులో సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న లాక్ డౌన్ తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ […]
సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన తోట భాస్కర్ కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును సోమవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ తల్లడి పుష్పలత కలసి భాస్కర్ కు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి, మంగపేట: ములుగు జిల్లా మంగంపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 10 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మరణించిన ఈసం లేపాక్షి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు ధరించాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సీతక్క కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ […]
సారథి: పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బొడగట్టు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లును నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతో సదుపాయంగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, రైస్ మిల్లు యాజమాన్యం కనకరాజు, కందుకూరి రవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం రాచపల్లి క్రాస్ రోడ్ వద్ద పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం బర్లగూడెం పంచాయతీలోని ఒంటిమామిడిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి ఛత్తీస్ గఢ్ బయలుదేరిన పెళ్లి ట్రాక్టర్ రాచపల్లి వద్ద ట్రాలీ లింక్ ఊడిపోవడంతో బోల్తాపడింది. ట్రాక్టర్ లో 30 మందికి పైగా ఉన్నారు. వీరంతా ఛత్తీస్ గఢ్ లోని నాంపల్లి […]