Breaking News

ఆధ్యాత్మికం

కాలభైరవుడిని ఎందుకు పూజించాలి

కాలభైరవుడిని ఎందుకు పూజించాలి

భై అంటే భయం అని, రవ అంటే ప్రతిధ్వని అని అర్థం. ఈ రెండు పదాలు భైరవుడి స్వభావాన్ని తెలియజేస్తాయి. కాలభైరవ సాధనలో ప్రత్యేక విషయమేమంటే సాధకుడికి భవిష్యత్​లో జరగబోయే ప్రమాదాలు, చెడు పరిణామాలు, రకరకాల సమస్యల గురించి ముందుగానే తెలియజేస్తాడు. కాలభైరవుడు ఆ సాధకుడికి సాధన కాలంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెంటే ఉండి కాపాడుతుంటాడని తంత్రశాస్త్ర విజ్ఞానం తెలియజేస్తుంది. సాధారణంగా భైరవుడు, శక్తి ఆలయాలకు కాపలాదారుడిగా వ్యవహరిస్తాడు. ఈ భైరవుడు ఎలా అవతరించాడంటే శివ […]

Read More
మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

సారథి న్యూస్, మల్దకల్(జోగుళాంబ గద్వాల): ఆ ఊరు వాసులు తిరుపతి వెళ్లరు.. గ్రామస్తులు భవనం రెండవ అంతస్తు కూడా నిర్మించరు.. కాదని ఎవరైన నిర్మాణానికి పూనుకుంటే అనర్థాలు జరిగిపోతాయని అందరిలోనూ అనమానం. స్థానికంగా వెలసిన తిమ్మప్పస్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలాక్షేత్రమైన మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. భక్తులను అలరిస్తూనే వారి కోరికలు నెరవేర్చుతున్నాడు.28 నుంచి ఉత్సవాలుఏటా మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులు తమ […]

Read More
శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More
ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం 16 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం 25న ముక్కోటి(వైకుంఠ ఏకాదశి) ఏకాదశి సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): డిసెంబర్​16 నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.. కాలాన్ని కొలిచేందుకు అనేక కొలమానాలను వాడతారు. అందులో చాంద్రమానం, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటే కాలాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని […]

Read More
వెంకన్న సన్నిధి.. కార్తీక శోభితం

వెంకన్న సన్నిధి.. కార్తీక శోభితం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ అమ్మవారికి సుప్రభాతసేవ, అభిషేకం, ఆరాధన నైవేద్యం, ఇతర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ ప్రధానార్చకుడు రామానుజాచార్యులు తెలిపారు. పక్కనే ఉన్న శివాలయంలో పరమశివుడికి ఏకరుద్రాభిషేకాలు, దీపారాధన నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం స్వామివారి […]

Read More
శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

నందివడ్డెమాన్ లో శనీశ్వర స్వామికి అభిషేకాలు పరమశివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం శనివారం శని త్రయోదశి సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలొచ్చి అభిషేకాలు, విశేష అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నువ్వులనూనె, నల్లటి వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను స్వామి వారికి నివేదన చేస్తారని, స్వామివారి అనుగ్రహం పొందేందుకు కొలుస్తారని ఆలయ […]

Read More
తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

సారథి న్యూస్​, తుంగభద్ర పుష్కరాలు: తుంగభద్ర నది పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. రాజోలిలోని పుల్లూరు, అయిజ మండలం వేణిసోంపురం ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ స్నానాలు చేసిన అనంతరం అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. :: ఫొటోలు, సాధిక్, మానవపాడు

Read More
పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

సారథి న్యూస్​, సూర్యాపేట: రెండేళ్లకు ఒకసారి జరిగే.. తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళాగా భావించే లింగమంతుల జాతరకు నగారా మోగింది. జాతర నిర్వహణపై సూర్యాపేటలోని క్యాంపు ఆఫీసులో గురువారం దేవాదాయశాఖ అధికారులు, యాదవ కులపెద్దలు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని జాతర తేదీలను ఖరారు చేశారు. వేడుక ప్రారంభానికి 15 రోజులు ముందు అంటే 2021 ఫిబ్రవరి 14న ఆదివారం దిష్టిపూజ […]

Read More