సారథి న్యూస్, వరంగల్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా అసంఘటిత రంగ కార్మికులు కొందరు ఉపాధి లేక ఇబ్బంది […]
సారథి న్యూస్, మహబూబాబాద్: గృహమే కదా స్వర్గసీమ! అన్న పెద్దలమాటను ఆచరించి ప్రతిఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల బారినపడకుండా క్షేమంగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిరిజన సంక్షేమ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇంట్లోని కిచెన్, హాల్, కిటికీలు, ఫ్రిజ్, ఆవరణలోని వరండాలను ఆమె శుభ్రంచేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుతో తాను కూడా […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వివిధ పథకాల కింద చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి 2016–19 సంవత్సరానికి మంజూరైన అభివృద్ధి పనులు, స్మార్ట్ సిటీ పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. పట్టణంలో ప్రజల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 9 పంచాయతీ కార్యదర్శి పోస్టులు(రెగ్యులర్, జూనియర్) తాత్కాలిక ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ నుంచి ఎంపిక చేసేందుకు ధ్రువీకరణ పత్రాలను ఈనెల 6న ఉదయం10.30 గంటలకు జిల్లా పంచాయతీ ఆఫీసులో పరిశీలిస్తామని కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఈ మేరకు మెరిట్ లిస్టును 1:3 నిష్పత్తిలో జిల్లా పంచాయతీ ఆఫీసులో నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమినషరేట్‌లోని మట్వాడ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో చనిపోయిన కానిస్టేబుల్ కె.సదానందం సతీమణి రమాదేవికి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ చేయూత పథకం కింద రూ.లక్షన్నర చెక్కును శుక్రవారం అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబ స్థితిపరిస్థితులను కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వపరం అందాల్సిన బెనిఫిట్స్‌ను తక్షణమే అందేలా చూడాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ గౌడ్‌కు సూచించారు.
సారథి న్యూస్, వరంగల్: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కాల్వల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ బస్సులను పరిశీలించారు. మాస్కులు లేకుండా వచ్చేవారిని బస్సుల్లోకి ఎక్కించుకోకూడదని సూచించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
వీడిన గొర్రెకుంట మర్డర్ మిస్టరీ పప్పన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియురాలి కోసం 9 మంది దారుణ హత్య వెల్లడించిన వరంగల్ సీపీ రవీందర్ సారథి న్యూస్, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట హత్యల వెనక మిస్టరీని పోలీసులు ఛేదించారు. పప్పన్నంలో నిద్రమాత్రలు కలిపి 9 మందిని హత్య చేశాడు నిందితుడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను సోమవారం మీడియా ఎదుట […]
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారథి న్యూస్, జనగామ: నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సూచించారు. ఆదివారం జనగామలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను రాజులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి ఇచ్చి సాగును ప్రోత్సహిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, తాటికొండ […]