Breaking News

తెలంగాణ

స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

సారథి ప్రతినిధి, సిద్దిపేట: కారును పార్కింగ్ చేసి స్కూటీపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశాడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ (గోదాంగడ్డ)కు చెందిన సదరు వ్యక్తి స్కూటీపై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం […]

Read More
ఊరంతా క్లీన్ గా ఉండాలని శానిటైజేషన్

ఊరంతా క్లీన్ గా ఉండాలని శానిటైజేషన్

సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపెల్లిలో సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ నల్లాల విక్రమ్ గురువారం పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శానిటైజేషన్ చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఎవరికైనా కరోనా అని అనుమానంగా ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉప […]

Read More
నేడే రంజాన్ పండగ

నేడే రంజాన్ పండగ

సారథి, మానవపాడు: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని, అందరూ సుఖశాంతులతో జీవనం కొనసాగించాలని ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జామియా మసీదు ముతవల్లి మహబూబ్ పాషా కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ చేసుకోవాలని కోరారు.

Read More
కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

సారథి, వనపర్తి: కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. గురువారం పెబ్బేరులో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అభినందనలు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదని, ఇంటింటి సర్వేలో జ్వరపీడితులను గుర్తించి […]

Read More
బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై […]

Read More
సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]

Read More
వాట్సాప్ లో వినతిపత్రం

వాట్సాప్ లో వినతిపత్రం

  • May 12, 2021
  • Comments Off on వాట్సాప్ లో వినతిపత్రం

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తోందని రామడుగు బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరస్ ఉధృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోందన్నారు. ప్రజలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రుల్లో చేరితే, వసతుల లేమితో ఆస్పత్రులు కోట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రాణాలు దక్కించుకుందామని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే, లక్షలాది రూపాయలను దండుకుంటున్నాయని ఆరోపించారు. కరోనా పేషంట్లకు కుటుంబం చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక వేలాధి […]

Read More
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

  • May 12, 2021
  • Comments Off on నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిందన్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు కిరాణ, వర్తక, వ్యాపార సముదాయాలు తెరిచే ఉంటాయన్నారు. అనంతరం ఉదయం 10గంటల నుంచి పూర్తి స్థాయిలో […]

Read More