Breaking News

కర్నూలు

వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

సారథి న్యూస్​, కర్నూలు: గత ప్రభుత్వం నిర్లక్ష్యం పాలకుల కక్కుర్తి కారణంగా ఓ వర్గానికి చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల్లో భాగంగా వక్ఫ్‌బోర్డు భూములు పరిరక్షణకు కృషిచేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు అందడంతో ఆదివారం ఏపీ వక్ఫ్‌బోర్డు సీవో ఆలీబాషాతో కలిసి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్‌, […]

Read More
మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

సారథి న్యూస్, కర్నూలు: మహిళ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలుచేసిందని మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ మురళి అన్నారు. ఆదివారం నగరంలోని ముజాఫర్‌ నగర్‌లో వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలోనూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చినమాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరా నిధు సమకూర్చడం సంతోషించదగ్గ విషయమని, వనితలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్కాచెల్లెమ్మలకు ఆసరా, జగనన్న అమ్మఒడి, […]

Read More
ఐఐటీ జేఈఈ మెయిన్స్లో శ్రీ చైతన్య విద్యార్థుల హవా

ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో విద్యార్థుల హవా

సారథి న్యూస్​, కర్నూలు: ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ 2020 పరీక్షల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ స్థాయిలో 100 కు 100 పర్సెంటేజ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 24, అందులో శ్రీ చైతన్య విద్యార్థులు ఏడుగురు ఉన్నారు. వివిధ కేటగిరీల్లో జి.చంద్రడేవిడ్ 164, ఆర్.సుధాకర్ నాయక్ 311, పి.వంశీకృష్ణ 919వ ర్యాంకులు సాధించినందుకు ఏజీఎం మురళీకృష్ణ అభినందించారు. బి.శ్రీజ 98.58, హెచ్ […]

Read More
ఈవీఎం గోడౌన్ పరిశీలన

ఈవీఎం గోడౌన్ పరిశీలన

సారథి న్యూస్​, కర్నూలు: జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ బయట వైపు సీల్ వేసి ఉన్న తాళాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీఆర్వో పుల్లయ్య, ఎలక్షన్ తహసీల్దార్ కుమారస్వామి ఉన్నారు.

Read More
శేషసాయినాథ్ కు ఘనసన్మానం

శేషసాయినాథ్ కు ఘనసన్మానం

సారథి న్యూస్, కర్నూలు: ప్రధానమంత్రి కౌశల్ ఆచార్య అవార్డు గ్రహీత శేషసాయి నాథ్ ను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ ఘనంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆయనకు మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ అధికారి విన్సెంట్, స్కిల్ డెవలప్​మెంట్​ శిక్షకులు పాల్గొన్నారు.

Read More
డిప్యూటీ సీఎం ప్లాస్మా దానం.. హర్షణీయం

డిప్యూటీ సీఎం ప్లాస్మా దానం.. హర్షణీయం

సారథి న్యూస్, కర్నూలు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా రోగికి గొప్ప హృదయంతో ప్లాస్మాదానం చేయడం హర్షణీయమని వైఎస్సార్​సీపీ నేత కేదార్ నాథ్​హర్షం వ్యక్తంచేశారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.

Read More
జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని కలిసిన యువ ఎమ్మెల్యేలు

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని కలిసిన యువ ఎమ్మెల్యేలు

సారథిన్యూస్‌, కర్నూలు: కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను గురువారం యువ ఎమ్మెల్యేలు ఎంఏ హఫీజ్‌ఖాన్‌, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ తెలిపారు.

Read More
ఆలయాలపై దాడులా.. సిగ్గుచేటు

ఆలయాలపై దాడులా.. సిగ్గుచేటు

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ ​సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ […]

Read More