సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ సెట్) ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 5వ తరగతి గురుకుల స్కూళ్లల్లో ప్రవేశాల కోసం ఎప్రిల్ 23న నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు సోమవారం రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం ఎస్సీ,ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి సీట్లు కెటాయించనున్నారు. కానీ ఫలితాలలో టీజీసెట్ ఎంట్రెన్స్ రాసిన స్టూడెంట్లకు వచ్చిన మార్కులు ఎన్నో అధికారులు వెల్లడించడం లేదు. […]
సామాజిక సారథి , బిజినపల్లి : వడదెబ్బకు గురై ఉపాధి కూలి మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది .. గ్రామస్తులు , కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వె ల్గొండ గ్రామానికి చెందిన బొంత వెంకటయ్య (57) అనే వ్యక్తి రోజువారీగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి కూలి పనికి వెళ్లి చేస్తున్న సంఘటన ప్రదేశంలోనే ఎండ తీవ్రతకు గురై అనారోగ్యంతో కింద పడిపోవడంతో అక్కడే ఉన్నవారు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చనిపోయినట్టు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల బతుకులు త్వరలోనే రోడ్డున పడనున్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజిల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీచేసేందుకు ఇదివరకే టీఎస్ పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రావడంతో పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. బుధవారం టీఎస్ పీఎస్సీ జూనియర్ లెక్చరర్ల ఎగ్జామ్స్ డేట్స్ ను సైతం ప్రకటించడంతో గెస్ట్ లెక్చరర్ల గుండెల్లో గుబులు మొదలైంది. జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ త్వరలోనే కంప్లీట్ కానుండటంతో […]
సామాజికసారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం రేపుతోంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజేషన్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేయడంతో కొందరు లెక్చరర్లు చేస్తున్న మాయజాలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఇంటర్ బోర్డును మోసం చేస్తున్నారని స్టూడెంట్ యూనియన్ నాయకులు వనపర్తి డీఐఈవో జాకీర్ హుస్సేన్ కు ఫిర్యాదుచేసి నెల […]
సామాజికసారథి, బిజినేపల్లి: మండలంలోని వెల్గొండ గ్రామంలో బుధవారం సిపిఐ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈర్ల నర్సింహ అనారోగ్యంతో మరణించడంతో గురువారం వారి నివాసంలో వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వెల్గొండ గ్రామసర్పంచ్ గా, ఎంపీటీసీ గా, గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన […]
సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం పటాన్ చెరు పట్టణంలోని […]
ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం […]
సామాజిక సారథి, అమీన్ పూర్: పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే జీఎంఆర్ విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. అమీన్ పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం, బీఎస్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయాల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. బుధవారం పటేల్ గూడ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే […]