Breaking News

ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప గుణం

ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప సాయం

సామాజిక సారథి, అమీన్ పూర్: పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే జీఎంఆర్ విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. అమీన్ పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం, బీఎస్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయాల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. బుధవారం పటేల్ గూడ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే జీఎంఆర్ కాలనీవాసులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పటాన్ చెరు నియోజకవర్గంలో పరమత సహనానికి పెద్దపీట వేస్తూ, అన్ని మతాల ప్రార్థన స్థలాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవలని కోరారు. దేవాలయాల నిర్మాణానికి విరాళం అందించడం పట్ల కాలనీవాసులు ఎమ్మెల్యే జీఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానంద్, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచులు నితీషా శ్రీకాంత్, భాస్కర్ గౌడ్, కృష్ణ, పాండు, సీనియర్ నాయకులు రాజు, మల్లేష్, జ్ఞానేశ్వర్, శ్రీకాంత్ రెడ్డి, గోవిందు, కాలనీ వాసులు పాల్గొన్నారు.