సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్. […]