సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామ సర్పంచి సుదర్శన్ గౌడ్ ను అదే గ్రామానికి చెందిన యువకుడు వేముల సైదులు తప్ప తాగి ఫోన్ లో అసభ్య పదజాలంతో దూషించాడు. చంపివేస్తానని బెదిరించిన యువకుడిని సోమవారం పోలీసులు తహసీల్దార్ అంజిరెడ్డి ముందు బైండోవర్ చేశారు . మరోమారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అంజిరెడ్డి యువకుడిని హెచ్చరించారు . చాలామంది యువత ఉపాధి […]
సామాజికసారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇదీ ఆలయ విశిష్టతదళితులే […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలంలోని నల్లవెల్లిలో కల్లు పంచాయితీ చినికి చినికి గాలివానగా మారింది. కాంట్రాక్టర్ ముందస్తుగా రూ.2లక్షలు ఒప్పుకున్న విధంగా రూ.లక్ష ముట్టజెప్పాడు. మరో రూ.లక్ష ఇవ్వాల్సి ఉంది. తనకు మాముళ్లు ఇవ్వలేదని గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కల్లు అమ్మకాలను బంద్ చేయించాడు. దీంతో రోజువారీగా కల్లుకు అలవాటువాడిన వారు బిత్తరపోతున్నారు. ఇంతలో ఈ విషయం మరో ప్రజాప్రతినిధి దాకా వెళ్లింది. ఆయన తనకు సదరు లీడర్ తో ఉన్న రాజకీయ […]
-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు కందికొండ మోహన్సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రముఖ జర్నలిస్ట్ సతీష్ చందర్ తో పాటు, జర్నలిజం కళాశాల కరస్పాండెంట్ గౌరీ , కవి జయరాజు ఇతర మేధావులను అప్రజా స్వామీక పద్ధతిలో అరెస్టు చేయడం సరైనది కాదని వారిని వెంటనే వారిని విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్బంగా జర్నలిస్ట్ మోహన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, […]
సామాజికసారథి, వెబ్ డెస్క్: శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. […]
… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిసామాజిక సారధి , బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద జరుగుతున్న కారకొండ కట్ట నిర్మాణ పనులలో నాసిరక పనులతో కారుకొండ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు . మంగళవారం మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా కారకొండ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేశారు . ఈ […]
నాగర్ కర్నూల్ , సామాజిక సారథి : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన పేదల పార్టీని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువస్తేనే దళిత బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు . మంగళవారం తెలకపల్లి మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో హథ్ సే హథ్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి […]
సామాజిక సారథి , కర్నూల్:శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లే శివ స్వాముల కోసం సేవా శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ అభినందించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలినడకన నాగర్ కర్నూల్ ప్రాంతం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకునే శివ స్వాములు కోసం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ వద్ద ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి, షాహిస్తా న్యూ […]