Breaking News

Day: December 2, 2021

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

సామాజిక సారథి, వెల్దండ: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక హెల్త్​సెంటర్​ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్​సీ డాక్టర్ తిలక్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ వచ్చినట్లు అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ సోకినవారు అధిక జ్వరంతో బరువు తగ్గడం, రాత్రిళ్లు విపరీతమైన చెమట రావడం, పొత్తి కడుపు నొప్పి, నిరంతర వీరోచనాలు ఉంటాయని చెప్పారు. ఎయిడ్స్​నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, […]

Read More
8న పార్లమెంట్ ముట్టడి

8న పార్లమెంట్ ​ముట్టడి

సామాజిక సారథి, వెల్డండ: బీసీ గణన చేపట్టాలనే డిమాండ్​తో ఈనెల 8న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టే పార్లమెంట్​ముట్టడి కార్యక్రమాన్ని బీసీలు విజయవంతం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నకినమోని పెద్దయ్య యాదవ్ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకులు అక్రమ సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశారని, సెటిల్ మెంట్ల మీద ఉన్న ప్రేమ ప్రజాసమస్యలపై చూపడం లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా […]

Read More
కలెక్టరేట్ లో మీసేవ కేంద్రం

కలెక్టరేట్ లో మీసేవ కేంద్రం

 సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: వివిధ సమస్యల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులు, అర్జీదారుల కోసం జిల్లా అధికార యంత్రాంగం మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మీసేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి కి సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
రైతులపై రాజకీయమా..?

రైతులపై రాజకీయమా..?

  • December 2, 2021
  • Comments Off on రైతులపై రాజకీయమా..?

బీజేపీ, టీఆర్ఎస్ విధానాలపై ఆరెస్పీ ఆగ్రహం నార్కట్ పల్లిలో ఐకేపీ కేంద్రం పరిశీలన సామాజిక సారథి, నార్కెట్ పల్లి: దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ కో ఆర్డినేటర్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో దేశానికి అన్న పెట్టే […]

Read More
ఒడిషా వలసకూలీలపై విచారణ

ఒడిషా వలసకూలీలపై విచారణ

సామాజిక సారథి, జడ్చర్ల: మండలంలో ఇటుక బట్టీల యజమానితో చిత్రహింసలకు గురవుతున్నారని ఒడిశా వలస కూలీల ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవుడి గుట్ట సమీపంలో ఇరవైరోజుల క్రితం మాధవరావు అనే కాంట్రాక్టర్ ఇటుక బట్టీలను తయారు చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సుమారు 13మంది వలస కూలీలను తీసుకొచ్చారు. ఓ వలసకూలీ తమను ఇటుక […]

Read More
రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వమే

రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వమే

  • December 2, 2021
  • Comments Off on రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వమే

పార్లమెంట్ లో స్పస్టమైన ప్రకటన చేయాలి మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి  సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వామేనని, వారి మనోవేదన సీఎం కేసీఆర్ కు ప్రతిబింబంలాంటిదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని గుత్తా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్సీఐ […]

Read More
ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు

ఇక పెరగనున్న బస్సుచార్జీలు ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు ఇతర బస్సుల్లో 0.30 పైసలు ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్​ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. […]

Read More
నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అంటూ టాలీవుడ్‌ హీరో నాగార్జున ట్వీట్‌ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీరని విషాదాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్ధలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీటి నివాళులర్పించారు. ఈ క్రమంలో నాగార్జున కూడా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అని ట్వీట్‌ చేశారు. ఇదే […]

Read More