సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలను నడిపించేందుకు ప్రభుత్వం సరైన బడ్జెట్ ఇవ్వలేదు.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద భిక్ష అడగాల్సి వచ్చేదని గురుకులాల పూర్వ కార్యదర్శి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గుర్తుచేసుకున్నారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఒక్కోరూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెడుతూ పేదవర్గాల బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించగలిగామని వివరించారు. టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం గురుకులాలకు ఏదో చేశామని, అహో, […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు, రెబ్బవరం, గొల్లపూడి గ్రామాల్లో వైరస్ సోకిన మిర్చి తోటలను శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి తోటలకు తామరపురుగు తెగులు ఆశిస్తున్నట్లు గుర్తించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి అపర్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్, ఏఈవోలు వెంకట్ నర్సయ్య, వాసంతి కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
సామాజిక సారథి, మహబూబ్ నగర్: ప్రజలకు ప్రభుత్వాలకు వారథిగా ఉంటూ నిస్వార్థంగా వార్తలు రాస్తున్న విలేకర్లపై దాడులకు పాల్పడితే సహించబోమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జర్నలిస్టు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గండీడ్ మండల వెలుగు రిపోర్టర్ రామకృష్ణారెడ్డి రైతుల కష్టాలపై వార్తలు రాయడంతో, గండీడ్ మండలం ఎంపీపీ మాధవి అసభ్యపదజాలంతో దుషించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని బాధిత రిపోర్టర్ పేపర్లో వార్తగా […]
ప్రముఖులకు శిల్పాచౌదరి వల రూ.కోట్లలో దండుకుని మోసం ఫిర్యాదులతో అరెస్ట్ చేసిన పోలీసులు సామాజిక సారథి, హైదరాబాద్: పార్టీల పేరుతో టాలీవుడ్ హీరోలు, ప్రముఖులను వలలో వేసుకుని కోట్ల రూపాయలను దండుకున్న వ్యాపారవేత్త, సినీనిర్మాత శిల్పాచౌదరీని శనివారం పోలీసులు అరెస్ట్‌చేశారు. నార్సింగ్ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లాలో నివాసం ఉంటున్న చౌదరి గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టీ పార్టీలు ఏర్పాటు […]
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థుల కోసం ఓ కళాశాలకోసం దానం చేసిన స్థలంలో ప్రస్తుతం కబ్జాకోరులు కన్నుపడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణ లోపల అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ప్రజల సంఘాల నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. […]
విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే ఓకే పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా చూడండి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించండి అధికారులతో సీఎస్‌సోమేశ్‌కుమార్ సామాజిక సారథి, హైదరాబాద్: పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునేవారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని చెప్పారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా అగ్రికల్చర్, సివిల్‌సప్లయీస్ […]