Breaking News

Day: July 22, 2021

దంచికొడుతున్న వాన

దంచికొడుతున్న వాన

ఏకమైన వాగులు, వంకలు.. నిండుకుండలా చెరువులు, కుంటలు లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల వాగుల్లో కొట్టుకుపోయినవారిని కాపాడిన పోలీసులు సారథి ప్రతినిధి, జగిత్యాల/జగిత్యాల రూరల్/వేములవాడ/పెద్దశంకరంపేట/నాగర్​కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ, గోదావరి నదుల్లోకి నీటి ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కుండపోత వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం- గుల్లపేటవాగు పైనుంచి వెళ్తుండగా వరద ఉధృతికి కారు […]

Read More
మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ

మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ

సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల‌కు మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజభూమారెడ్డి గురువారం రెయిన్‌ కోట్లు పంపిణీ చేశారు. చొప్పదండి మొట్టమొదటి సర్పంచ్ స్వర్గీయ గుర్రం చిన్నాఎల్లారెడ్డి ట్రస్ట్ వారు వాటిని సమకూర్చారు. పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తల‌ను పాటించి అనారోగ్యం బారినపడకుండా ఉండాల‌ని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కాట్నపల్లి మదన్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, కమిషనర్ అంజయ్య, కొత్తూరి నరేష్, మేనేజర్ ప్రశాంత్, హెల్త్ అసిస్టెంట్ మహేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
స్కూళ్లను తెరిచి.. పిల్లలకు వ్యాక్సిన్​ఇవ్వాలి

స్కూళ్లను తెరిచి.. పిల్లలకు వ్యాక్సిన్ ​ఇవ్వాలి

సారథి, చొప్పదండి: రాష్ట్రంలో స్కూళ్లను వెంటనే తెరవాలని, పిల్లలందరికీ తక్షణమే వ్యాక్సిన్​ఇచ్చి వారి భవిష్యత్ దృష్ట్యా ఆన్​లైన్ ​క్లాసులకు స్వస్తి పలకాలని, స్కూళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకొని విద్యాబోధన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్ కుమార్ కోరారు. గురువారం ఆయన చొప్పదండి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఏడాదికిపైగా బోధనకు దూరంగా ఉండటం ద్వారా విద్యార్థులు చదువులో వెనుకబడటంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని అన్నారు. […]

Read More
ఘనంగా వినోద్​కుమార్​జన్మదిన వేడుకలు

ఘనంగా వినోద్​కుమార్ ​జన్మదిన వేడుకలు

సారథి, చొప్పదండి: చొప్పదండి టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు బంధారపు అజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్లో ఆఫీసులో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్​కుమార్ ​జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై కేక్ కట్ చేశారు. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీఎం కేసీఆర్ కుడి భుజం మాదిరిగా పనిచేశారని, ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ ఆయన ఆలోచన విధానం కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ […]

Read More
సీఎం కేసీఆర్​చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి ప్రతినిధి, జగిత్యాల: రెండవ విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ రూ.6వేల కోట్లు కేటాయించినందుకు జగిత్యాల జిల్లా కురుమ సంఘ నాయకులు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డాక్టర్ ​సంజయ్ కుమార్ ను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, పట్టణాధ్యక్షుడు పుల్ల గంగారాం, ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్, చెట్టె రమేష్, సాయిల్ల మురళి, బండారి మల్లేశ్, […]

Read More
కాంగ్రెస్​నాయకుల అరెస్ట్​

కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​

సారథి, ఉండవెల్లి/అయిజ(మానవపాడు): దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన పెగసిస్ స్ర్రైవేర్ ​ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాజ్ భవన్ ముందు ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింగల్ విండో చైర్మన్ గజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్ట్​లతో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలను […]

Read More
ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

సారథి, రామడుగు: 26 ఏళ్లపాటు సేవలు అందించి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న మాజీ ఐపీఎస్​ అధికారి డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​కు ఘనస్వాగతం పలుకుతున్నట్లు స్వేరోస్ ఇంటర్​నేషనల్​ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి పేర్కొన్నారు. 9ఏళ్ల పాటు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంతోమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. రాజ్యాధికారం అందరి హక్కు అని, సాధించుకునేందుకు ముందుకు సాగుతామన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ఆర్థిక విప్లవం సృష్టించి ప్రపంచంలో మన […]

Read More
కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

సారథి, రామడుగు: పెగసెస్ స్ర్పైవేర్ ​యాప్ తో కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడికి తరలివెళ్తున్న రామడుగు మండల కాంగ్రెస్ నాయకులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బొమ్మరవేని తిరుపతి, జిల్లా కాంగ్రెస్ […]

Read More