సారథి, కొల్లాపూర్(పెద్దకొత్తపల్లి ): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్ పాముల గ్రామంలో పేకాట ఆడుతున్న 9మంది పేకాటరాయుళ్ల స్థావరాలపై దాడిచేసి అరెస్టు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. వారి నుంచి రూ.8,940 నగదు, అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. మున్ముందు గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.
సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు […]
సారథి, వేములవాడ: స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు న్యాయవాదుల పాత్ర మరువలేనిదని గోదావరి అర్బన్ మల్టీ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ వేములవాడ శాఖ సీఈవో, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాచమనేని శ్రీనివాసరావు కొనియాడారు. శనివారం అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, భూమేష్, రేగుల దేవేందర్, గోపి, కిషోర్ రావు, అనిల్, గుడిసె సదానందం, నక్క దివాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. […]
సారథి, వాజేడు: ములుగు జిల్లా మూరుమూరు పంచాయతీ గణపురంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యమున గ్రామంలో బాలింతలు గర్భిణులు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, సర్పంచ్, సెక్రటరీ, వైద్యసిబ్బంది కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశా కార్యకర్త, అంగన్ వాడీ టీచర్ పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, ఈనెల 19 తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మాతంగి కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు www.telangana.gov.in, లేదా www.tswrais.inవెబ్ సెట్ ల లో ప్రవేశ పరీక్ష ఫలితాలను సరిచూసుకోవాలని కోరారు. మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు […]
సారథి, కల్వకుర్తి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ నాగర్‌కర్నూల్‌జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కల్వకుర్తి ఆర్డివో రాజేష్ కుమార్, తహసీల్దార్ రాంరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈనెల 12 నుంచి రిలే దీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోసం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం ఇవ్వగా అనుమతి లభించలేదు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నేత, సీనియర్ జర్నలిస్టు గోలి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో రామచంద్రం అనే వ్యక్తి కరోనాతో బాధపడుతుండగా చిరంజీవి అభిమానులు అతనికి ఆక్సిజన్కాన్సంట్రేటర్ను శనివారం అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు మారం ప్రవీణ్ కుమార్, అరుణ్ తేజ చారి, విజయ్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, అగయ్య తదితరులు పాల్గొన్నారు.
సారథి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీయూజీసెట్) ఫలితాలను గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ శనివారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్షను ఈనెల 11వ తేదీన నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈనెల 19, 20, 21 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in అలాగే www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. సంబంధిత […]