సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని నూగూర్ వెంకటాపురం, వెంకటాపూర్, గోవిందరావుపేట, వాజేడు మండలాల్లోని కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ తరగతులను బోధించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో గెస్ట్ ప్యాకల్టీని తాత్కాలిక ప్రాతిపదికన నియమించి ఇంటర్ తరగతులను కొనసాగించేవారు. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై 45 రోజులు గడిచినా ప్రభుత్వం […]
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకున్న బీజేపీ తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. అలాంట బోర్డు ఏర్పాటుచేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పసుపు బోర్డు పెట్టే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర […]
ఆగ్రహం వ్యక్తంచేసిన సభ్యులు ఎంపీటీసీల పాత్ర ఉత్సవ విగ్రహాలే హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు సారథి న్యూస్, మానవపాడు: రేషకార్డులు రాలే, మూడేళ్లు గడిచినా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు కాకపోతే గ్రామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉండి ఏమి చేయాలని ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడునెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం ఎందుకోసమని, సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ ఎంపీపీ కార్యాలయంలో సమీక్షించారు. గ్రామాల్లో నర్సరీ పనులు నిర్వహణ, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం పనుల్లో పురోగతి..ఉపాధి హామీ పనులకు కూలీల సమీకరణ పెంపు తదితర విషయాలను చర్చించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్, పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొఫెషనల్ సమయాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించడంతో పాటు రెగ్యులర్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంపై మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో ముఖ్యమంత్రి తమ సమస్యలపై స్పందించడంతో వారు హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా నాయకులు నరసింహాగౌడ్, పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్ రమేష్ మహిపాల్ పాల్గొన్నారు.