Breaking News

Day: March 6, 2021

నిరాశ్రయులను ఆదరిద్దాం

నిరాశ్రయులను ఆదరిద్దాం

సారథి న్యూస్, ములుగు: మతిస్థిమితం కోల్పోయిన నిరాశ్రయులను ఆదరించాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల క్రితం మల్లంపల్లిలో ఓ అనాథ వృద్ధుడికి తస్లీమా స్వయంగా అన్నం తినిపించిన విషయం విదితమే. శనివారం ఆమె ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వృద్ధుడు చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, జుట్టుతో చలనం లేకుండా పడుకుని ఉండడం చూసి ఆమె చలించిపోయారు. క్షవరం చేయించి తానే స్వయంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు కొనిచ్చి […]

Read More
ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

సారథి న్యూస్, హుస్నాబాద్: అతనొక సాధారణ ఆర్ఎంపీ. రోజుకు పదో పరకో సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఉన్నట్టుండి సదరు వ్యక్తి ఇంట్లో శనివారం లక్షల రూపాయలు బయటపడ్డాయి. అధికారులు సోదాలు జరిపి వెలికితీయడంతో స్థానికులు కంగుతిన్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కథనం మేరకు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు చేయగా రూ.66.11లక్షలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించడంతో […]

Read More
అట్టహాసంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

అట్టహాసంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు పెద్దశంకరంపేట మండలంలో విశేష స్పందన లభిస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలతో పాటు నగదును పార్టీ మండలాధ్యక్షుడు మురళి పంతులు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి అందజేశారు. మండలంలో దాదాపు ఐదువేలకు పైగా సభ్యత్వ నమోదు చేశామని, అందులో ఇప్పటివరకు 2500 సభ్యత్వాలను ఆన్​లైన్​లో నమోదు చేసినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. […]

Read More
కొప్పొల్ ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

కొప్పొల్ ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మహాశివరాత్రి పర్వదినం ఉత్సవాల సందర్భంగా మండల పరిధిలోని కొప్పల్ సంగమేశ్వర ఆలయం ఆవరణలో నిర్వహించే జాతర ఏర్పాట్లను పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ పరిశీలించారు. తహసీల్దార్ చరణ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొప్పొల్ జాతర ఉత్సవాలు 13వ తేదీ వరకు నాలుగు రోజులు కొనసాగుతాయని వివరించారు. భక్తులకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, ఆలయ కమిటీ సభ్యులను […]

Read More
క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

సారథి న్యూస్, వాజేడు: మండలంలోని కొంగల గ్రామంలో జగన్నాథపురం సబ్ సెంటర్ లో ఏసీఎఫ్ క్యాంపు నిర్వహించారు డాక్టర్ యమున. ఈ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం, తేమడతో రక్తంపడడం, ఆకలి మందగించడం వంటి వారిని గుర్తించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కార్యక్రంమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర రావు, సర్పంచ్ శివరామకృష్ణ, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎస్టీఎస్ వెంకటేశ్వరరావు, ఎస్.రవి, ఎల్ టి.రజినీకాంత్ పాల్గొన్నారు.

Read More
ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ​పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభివాణి దేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత తిరుపతయ్య పట్టభద్రులను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడు మండలం, పల్లెపాడు, బోరవెల్లి, చండూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల […]

Read More