సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్ లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను సక్సెస్ చేయాలని స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా ఎల్లూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి జ్ఞానయుద్ధభేరి సభ ఆవశ్యకతను తెలిపారు. బోరబండతండా, అంజనగిరి తండాల్లో గురుకులాలు, చదువు అవసరాన్ని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్రగట్టు బొల్లారం మొలచింతలపల్లి, […]
సారథి న్యూస్, శంషాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇంధనం, గ్యాస్ ధరలు అధికంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులుగా ఎమ్మెల్సీ సురభివాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. […]
సారథి న్యూస్, తాడ్వాయి: పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కోరారు. శుక్రవారం మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో ములుగు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువతకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడారంలోని ఇంగ్లిష్ […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలో తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా వరాహమూర్తుల పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. అలాగే కుక్కల పోటీలు జరిగాయి. ఇదిలాఉండగా, ఏటా ఎడ్లబండ్ల లాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ పోటీలతో పాటు రెండేళ్లుగా కుక్కల పరుగు పోటీలు, పందుల కొట్లాట పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు తరలివచ్చారు.
సారథి న్యూస్, రామాయంపేట: ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్, జయంతి ఘోష్ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ సభ్యులు దుబాసి సంజీవ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో 60శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో రైతులు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. […]