సారథి న్యూస్, కొల్లాపూర్: మార్చి 28న నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో నిర్వహించ తలపెట్టిన స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం పెంట్లవెల్లి మండలం తహసీల్దార్ కిష్టానాయక్, జడ్పీటీసీ చిట్టెమ్మ చేతుల మీదుగా పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. స్వేరోస్ జ్ఞానయుద్ధభేరి సభ ఉద్దేశం, తమ ఆశయాలు, సిద్ధాంతాలను వివరించారు. సభకు ముఖ్యఅతిథిగా గురుకులాల కార్యదర్శి, రాష్ట్ర అడిషనల్ […]
సారథి న్యూస్, జడ్చర్ల: మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతుగా జడ్చర్ల, మహబూబ్నగర్లో ‘ఇంటింటికీ ప్రశ్నించే గొంతుక’ అనే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం చేశారు. పట్టభద్రులు, విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల ఉద్యోగులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నిరంతరం ప్రజల కోసం ఉద్యమం చేసే పాలమూరు ముద్దుబిడ్డ పోరాట యోధుడు ముకురాల శ్రీహరిని శాసనమండలికి పంపించేందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని పలువురు ప్రకటించారు. […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, తహసీల్దార్, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వాజేడు మండల […]
సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామానికి చెందిన గరగ నారాయణమ్మ సంవత్సరికం సందర్భంగా గరగ సురేష్, కుమార్ రాజు, సతీమణి ఇందు, కుమార్తె ముకుందప్రియ, బంధువులు కుమారి, బాలు తదితరులు స్థానిక గ్రేస్ హోమ్ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేశారు. అక్కడి వృద్ధులకు వారి కుమార్తె ముకుందప్రియ అన్నదానం చేశారు. గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు రామినేని రాజేంద్రప్రసాద్, పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారాయణ, […]
కేటీదొడ్డి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించడంతో రమేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. టీవీ, రెండు క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, సామాన్లు కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.రెండులక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సుభాషిణిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు రమేష్ కోరాడు.