ఘాట్‌రోడ్డులో ఘోరప్రమాదం నలుగురు దుర్మరణం 19 మందికి గాయాలు బాధితులు హైదరాబాద్ వాసులు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు ఐదో నంబర్ మలుపు వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మందికి గాయాలైనట్లు అనంతగిరి ఎస్సై తెలిపారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి […]
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతి కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో పాల్వంచ, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ఆన్లైన్ ద్వారా అర్జీలు తీసుకునేలా అధికారులకు అవగాహన […]
సారథి న్యూస్, కల్వకుర్తి: ఇంధన పొదుపుతోనే ఆర్టీసీ సంస్థ మనుగడ సాధిస్తుందని, కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆర్టీసీ డివిజినల్ మేనేజర్ ఉషాదేవి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి డిపోలోని డీఎం సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాలు, ఇంధన సంరక్షణ క్షమత’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వకుర్తి డిపోను ప్రమాదరహిత డిపోగా మార్చాలన్నారు. అనంతరం యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లు అరుణ్ కుమార్, అంజయ్య, మైనోద్దీన్ కు క్యాష్ అవార్డు అందజేశారు. […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ గురువారం ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జిల్లా పోలీస్ సిబ్బంది వెనకడుగు వేయకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించారని కొనియాడారు. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని వివరించారు. భారత శాస్త్రవేత్తలు, డాక్టర్లు తయారుచేసిన వ్యాక్సిన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న […]
సారథి న్యూస్, మెదక్: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌సభ్యుడు డాక్టర్ఆర్జీ ఆనంద్ అన్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు వారికి ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారులను దూషించినా, ఇబ్బందులు కలిగించినా వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ‘పిల్లలు.. వారి హక్కులు’పై జిల్లా […]
సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లాకు చెందిన గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొల్లారం గ్రామంలో పేద పిల్లలకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులను ఎంపీపీ శ్యామల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జ్నవీన్, పాస్టర్ శ్యామ్, సంస్థ సిబ్బంది మురళి కృష్ణారెడ్డి, అశోక్, సైదులు […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ఆధ్వర్యంలో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. పోరాడి సాధించుకున్న రూ.8,500 జీతాన్ని ఇప్పటికీ […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామశివారులో నూతనంగా ఏర్పాటుకానున్న ఓ కంపెనీకి ప్రభుత్వ అసైన్మెంట్ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భారతీయ కిసాన్‌మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కామారం గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి రాత్రికిరాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులతో పాటు కంపెనీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. […]