Breaking News

Day: January 30, 2021

చర్లలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి

చర్లలో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: గిరిజన విశ్వవిద్యాలయాన్ని చర్లలోనే ఏర్పాటుచేయడం ద్వారానే ఐదు రాష్ట్రాల ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్శా నర్సింహామూర్తి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం.నాగరాజు అభిప్రాయపడ్డారు. మైదాన ప్రాంతమైన ములుగులో ఏర్పాటుచేయడం సరికాదన్నారు. శనివారం వారు చర్లలో విలేకరులతో మాట్లాడారు. చర్లలో ఏర్పాటుచేస్తే ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీలకు అత్యంత అనువుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఆదివాసీలను ఉన్నతవిద్యకు […]

Read More
ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్​గా మారింది. ఇంతలో ఎస్సైకి విషయం తెలియడంతో ఆమెను అత్యంత చాకచాక్యంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ ఘటన శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లాలో సంచలనం రేపింది. బిజినేపల్లి మండలం సల్కర్​పేట గ్రామానికి చెందిన మాధవి వివాహిత. కుటుంబ కలహాలతో ప్రస్తుతం పుట్టిన ఊరులోనే ఉంటోంది. ‘వ్యక్తిగత […]

Read More
గాంధీజీ ఘననివాళి

గాంధీజీకి ఘననివాళి

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్​లో శనివారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ లోని అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీసీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ములుగు తహసీల్దార్ ఎం.సత్యనారాయణస్వామి, కలెక్టరేట్ ఏవో జె.శ్యాంకుమార్ పాల్గొన్నారు. వాజేడులో గాంధీజీ వర్ధంతివాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో శనివారం గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Read More
‘జహీరాబాద్’లో బీజేపీ జెంగా ఎగరేస్తాం

‘జహీరాబాద్’లో బీజేపీ జెండా ఎగరేస్తాం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు నిరంతరం కృషిచేస్తామని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందుకెళ్తుందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ యాదవ్, […]

Read More
సేవలతోనే గుర్తింపు

సేవలతోనే గుర్తింపు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: విధి నిర్వహణలో ప్రజలకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని సంగారెడ్డి తపాలా శాఖ సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీ స్ బి.శ్రీనివాస్, పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్​కుమార్​అన్నారు. శనివారం పెద్దశంకరంపేట పోస్ట్​ఆఫీసులో చిలపల్లి బీపీఎం సుదర్శన్ రిటైర్డ్​మెంట్​కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 42 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తపాలాశాఖలో సేవలందించడం అమోఘమన్నారు. అనంతరం బీపీఎం సుదర్శన్​ను తపాలా సిబ్బంది ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో గంగారాం విజయ్ కుమార్, సాయిరాం, కృష్ణవేణి, రాఘవేందర్, నిరంజన్, శంకర్, సాయిగౌడ్ […]

Read More