సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన యువకులతో పాటు, చేగుంట మండలం పొలంపల్లి గ్రామ యువకులు కలిసి మొత్తం 50 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం […]
భై అంటే భయం అని, రవ అంటే ప్రతిధ్వని అని అర్థం. ఈ రెండు పదాలు భైరవుడి స్వభావాన్ని తెలియజేస్తాయి. కాలభైరవ సాధనలో ప్రత్యేక విషయమేమంటే సాధకుడికి భవిష్యత్లో జరగబోయే ప్రమాదాలు, చెడు పరిణామాలు, రకరకాల సమస్యల గురించి ముందుగానే తెలియజేస్తాడు. కాలభైరవుడు ఆ సాధకుడికి సాధన కాలంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెంటే ఉండి కాపాడుతుంటాడని తంత్రశాస్త్ర విజ్ఞానం తెలియజేస్తుంది. సాధారణంగా భైరవుడు, శక్తి ఆలయాలకు కాపలాదారుడిగా వ్యవహరిస్తాడు. ఈ భైరవుడు ఎలా అవతరించాడంటే శివ […]
సారథి న్యూస్, రామగుండం: చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫారెస్ట్అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని, శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్, అడవిశాఖ […]
సారథి న్యూస్, రామగుండం: మహనీయుల జీవితాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీరామ విద్యానికేతన్ ఆవరణలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి, స్వామి వివేకానంద 150వ జయంతి, జాతీయ యువజన వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, […]