Breaking News

Day: January 2, 2021

సంక్రాంతి వేళ ఏపీకి స్పెషల్​ బస్సులు

సంక్రాంతి వేళ ఏపీకి స్పెషల్​ బస్సులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వివరించారు. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు3,380 ప్రత్యేక బస్సులను, ఏపీకి 1,600 బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. […]

Read More
కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు తయారుచేసిన వ్యాక్సిన్ సురక్షితమైందని, తీసుకునేందుకు వెనుకాడవద్దని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్​ రాజన్ అన్నారు. శనివారం నగరంలో కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రై రన్ లో భాగంగా గవర్నర్ దంపతులు హైదరాబాద్​ నగరంలోని తిలక్ నగర్ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. […]

Read More
స్వేరోస్​ సంబరాలకు రండి

స్వేరోస్​ సంబరాలకు రండి

సారథి న్యూస్​, అలంపూర్​: అలంపూర్ పట్టణంలో జనవరి 13,14 తేదీల్లో నిర్వహించబోయే స్వేరోస్ సంబరాలకు రావాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను ఆహ్వానించినట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, సీనియర్ స్వేరో ఎంసీ కేశవరావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్​పోస్టర్​ను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేతులమీదుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ​ఆర్.నాగరాజు, ఆర్.సునీల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Read More
పీవోఎస్ మిషన్ల ద్వారానే ఎరువులు అమ్మాలి

పీవోఎస్ మిషన్లతోనే ఎరువులు అమ్మాలి

సారథి న్యూస్, రామయంపేట: రైతులకు యాసంగి సీజన్ లో అవసరమైన ఎరువులను పీవోఎస్ మిషన్ల ద్వారానే విక్రయించాలని మెదక్ డీఏవో పరుశురాం నాయక్ ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. శనివారం మెదక్​ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టికలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించొద్దని హెచ్చరించారు. చలి నుంచి వరి […]

Read More
ఫ్రంట్​లైన్​వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, మెదక్: కరోనా సమయంలో వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ లో ఉండి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో శాయశక్తులా కృషిచేసి మరణాలను నివారించగలిగారని జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్​పి.వెంకట్రామరెడ్డి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో రాబోయే కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసిందన్నారు. కరోనా వ్యాక్సిన్​ను తొలిదశలో కోవిడ్ ఫ్రంట్ లైన్ ​వారియర్స్ […]

Read More
రెవెన్యూ డైరీ ఆవిష్కరణ

రెవెన్యూ డైరీ ఆవిష్కరణ

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను శనివారం జిల్లా ఇన్ చార్జ్​ కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలోఅధ్యక్షుడు మనోహర్ చక్రవర్తి, కార్యదర్శి మహేందర్ గౌడ్, చరణ్ సింగ్, ఇతర కార్యవర్గసభ్యులు, ఆర్డీవో, తహసీల్దార్​ పాల్గొన్నారు.

Read More