సారథి న్యూస్, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ రైతును రాజుగా, వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీ మాయమాటలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రైతువేదిక భవనం, వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రం భవనాలను మంత్రి మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. ఈ […]
సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు […]
సారథి న్యూస్, వెంకటాపురం: ఏజెన్సీలో భుక్తి కోసం, న్యాయబద్ధంగా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ నిరసన వ్యక్తంచేస్తున్న ఆదివాసీలను దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడడం సరికాదని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి పూనేం చంటి అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు […]