సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. 20వేల లీటర్ల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండా నీటిని సరఫరా చేసే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. శనివారం ప్రగతిభవన్ లో మంత్రి కె.తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20వేల […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని చిన్నశంకరంపేట ఎస్సై మహమ్మద్ గౌస్ ఆకాంక్షించారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో మహిళా మండలి అధ్యక్షురాలు గంగ, మహిళలతో కలిసి ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంగ మాట్లాడుతూ.. మహిళా సమస్యలు, ఆడపడుచుల మిస్సింగ్ కేసులు, భార్యాభర్తల గొడవలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరిస్తున్న పోలీసుల సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్సై గంగయ్య, హెడ్ […]
సారథి న్యూస్, ములుగు: మావోయిస్టు కీలకనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్(40) తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారన్న పక్కా సమాచారంతో ములుగు జిల్లా పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. జిల్లాలోని అడవిని జల్లెడ పడుతున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ, గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. కొత్త వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మావోయిస్టు కీలక నేత దామోదర్‌ను పట్టిచ్చిన వారికి రూ.రెండులక్షల బహుమతిని కూడా ఇస్తామమని పోలీస్ శాఖ ప్రకటన […]
సారథి న్యూస్, ములుగు: ఏటా జనవరి 1 నాటికి చేపట్టే స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటర్లుగా నమోదు చేసేందుకు అవగాహన కల్పించాలని, అలాగే చనిపోయినవారిని తొలగించేందుకు, మార్పులు, చేర్పులు చేయాలని ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణాఆదిత్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో లిస్టులో పేరు మాత్రమే ఉండేదని, ఇప్పుడు పేరుతో పాటు ఫొటో కూడా ఉందన్నారు. 10వ […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆహ్వానం అందుకున్న సినీతారలంతా దిల్ రాజు సదనానికి విచ్చేసి విందులో పాల్గొన్నారు. ఆయనతో అందరికీ అవసరమే మరి. ఈ వేడుక పక్కన పెడితే అభిమాన హీరోలంతా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ప్రాణ మిత్రుల్లా కనిపించడంతో ఫ్యాన్సంతా యమ ఖుషీ అయిపోతూ వాళ్ల ఫొటోలను షేర్ చేసే సందడిలో పడ్డారు. వాళ్లెవరో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.