తలమాసినోడితో ఏదీ కాదు ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తాం వరద సాయం ఇచ్చేకాడ కిరికిరి ఏంది? యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారసభలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రతి బడ్జెట్‌లో హైదరాబాద్‌కు రూ.10వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చేతులు ఊపినంత మాత్రాన సమస్య పోదన్నారు. ప్రధానమంత్రిని వరదసాయం కింద రూ.1300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బెంగళూరు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: రైతన్నలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్నిధి యోజనా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.ఆరువేలు అందిస్తోంది. ఈ దఫా రైతులకు రూ.2,000 చొప్పున చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమచేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల వివరాలను రాష్ట్రం, జిల్లా, గ్రామాల వారీగా విడుదల చేసింది. తమ పేర భూములు ఉన్న రైతులు రాష్ట్రం, జిల్లా, మండలం, […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు ప్రధాని మోడీకి వివరించగా.. వారి కృషిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్-19ను అరికట్టేందుకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని సైంటిస్టులు తనకు వివరించారని ప్రధాని మోడీ ట్వీట్‌చేశారు. అంతకుముందు మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కార్తీకమాసం శనివారం త్రయోదశి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా నివేదన చేశారని ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథశాస్త్రి అన్నారు. అష్టోత్తర నామాలు, నల్లనువ్వులు నల్లటి వస్త్రం, నువ్వుల నూనె జిల్లేడు పూలు […]
– తుఫాన్ జల్లుల్లో పుష్కరస్నానం సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి సన్నిధిలో తుంగభద్ర తీరం భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. శుక్రవారం పుష్కరఘాట్ కు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర కార్తీకమాసం కావడంతో భక్తులు తుంగభద్ర నదీమ తల్లిని కార్తీక దీపాలతో ఆరాధిస్తున్నారు. కార్తీకదీపాలు వెలిగిస్తూ అమ్మవారిని, అదేవిధంగా బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేకపూజలు చేశారు. ఓ వైపు తుఫాన్ ప్రభావంతో మేఘాలు కమ్మేసి వాన జల్లులు కురుస్తున్నా యాత్రికులు మాత్రం పుష్కర […]