సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్లో శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం మతపెద్దలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆప్యాయంగా పలకరించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాలిని గీతాప్రవీణ్ ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హిందూ.. ముస్లిం భాయ్ భాయ్ గా కలిసిపోయి గంగా.. జమున తాహజిబ్ సంస్కృతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాపాడుతున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు […]
సిడ్నీ: ఆసీస్ టూర్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కోహ్లీసేన చివరిదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. ఆసీస్ విధించిన 375 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులకే ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా(90; 76 బంతుల్లో 4×7, 6×4), శిఖర్ ధావన్(74; 86 బంతుల్లో 4×10) పోరాటం సాగించారు. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ ధాటిగా ప్రారంభించారు. […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఐకేపీ ఏపీఎం, విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరుపై మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకుని ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. శుక్రవారం రామాయంపేట పేట సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మృతిచెందిన పెద్దశంకరంపేట 1వ ఎంపీటీసీ రాజమణి లక్ష్మీనారాయణ మృతికి నివాళులర్పించారు. బద్దారం, శివాయిపల్లి, చిల్లపల్లి, ఉత్తులూర్ గ్రామాల్లో కరెంట్ తీగలు కిందకు వేలాడుతున్నాయని ఆయా […]