సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: ములుగు జిల్లా వాజేడు రేంజ్ పరిధిలోని పూసూర్ బీట్ లో 20 హెక్టార్ల ఎల్ఐఎం రైసింగ్ ప్లాంటేషన్ ను మంగళవారం సీసీఎఫ్ అక్బర్ సందర్శించారు. ప్లాంటేషన్ ను రోజు పర్యవేక్షణ చేసి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. చెట్లకు చెదలు ఉన్న చోట నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పనులపై తగిన సలహాలు సూచనలు చేశారు. అలాగే దులాపురం నర్సరీని తనిఖీచేశారు. వెంకటాపురం రేంజ్ పరిధిలోని అలుబకా గ్రామంలో నూతనంగా […]
సారథి న్యూస్, ములుగు: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోలు చేపట్టాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఆయన వెంకటాపూర్ లో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. కొనుగోలులో నిబంధనలు పాటించాలన్నారు. ప్రక్రియ నమోదు ఎప్పటికప్పుడు చేయాలని, మిల్లులకు ధాన్య రవాణాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం చూసుకుని కేంద్రాలకు తీసుకుని వచ్చేలా […]
సారథి న్యూస్, అలంపూర్(మానవపాడు): తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలం నుంచి జోగుళాంబ ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసును అలంపూర్ మున్సిపాలిటీ వారు, జోగుళాంబ ఆలయం ట్రస్ట్ బోర్డు వారు కలిసి సంయుక్తంగా మంగళవారం ఏర్పాటుచేశారు. సెట్వీన్ బస్సు సర్వీసులను మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్, టెంపుల్ బోర్డ్ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ […]
సారథి న్యూస్, పాలకొండ: పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలకొండ, వీరఘట్టం, రేగిడి ఆమదాలవలస మండలం, సచివాలయంలో ఉన్న ఉమెన్స్ ప్రొడక్షన్ (మహిళా పోలీసులు) తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ పీఎం శ్రావణి మాట్లాడుతూ.. నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సమష్టి కృషితో పనిచేయాలన్నారు. ప్రజలతో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జి.శంకర్రావు, పాలకొండ ఎస్సై ఆర్ జనార్దన్ రావు, వీరఘట్టం మండలం […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]