సారథి న్యూస్, వాజేడు, ములుగు: యాంత్రిక జీవన విధానంలో అలసిపోతున్న ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు పల్లె ప్రకృతివనాలు ఎంతో దోహదపడతాయని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)తో కలిసి ప్రారంభించారు. అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు తుదిదశకు చేరాయని వివరించారు. సేదదీరడానికి ఏర్పాటుచేసిన బెంచిలో కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు కాసేపు కూర్చుని […]
సారథి న్యూస్, బిజినేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు ఏకకాలంలో పూర్తయి వెంటనే వారికి పాస్ పుస్తకంలో భూమి వివరాలు నమోదవుతాయని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హన్మంత్‌రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్ఆఫీసులో ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలుదారులతో పాటు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ఈజీగా అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ అయిన కొద్ది సమయంలోనే […]
సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో 17మంది ఇన్ఫార్మర్లను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలు హరిభుషణ్, దామోదర్, రాజిరెడ్డి, మైలరపు అడేల్లును కలిసేందుకు చత్తీస్‌గఢ్‌కు వెళ్లి వారికి కావాల్సిన విప్లవ సాహిత్యాన్ని సమకూర్చేందుకు వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అరెస్ట్ అయినవారిలో డబ్బకట్ల సుమన్, చందా మహేష్, తాటిపాముల రమేష్, చిడం జంగుదేవ్, రమణ, గంట సత్యం, కుడిమెట్ల శ్రీనివాస్, మెంతని […]