Breaking News

Day: September 8, 2020

కుమారస్వామికి అభిషేకం

కుమారస్వామికి అభిషేకం

సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలు నిర్వహించారు. అభిషేకం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసిన అనంతరం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణలు చేశారు. స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతో విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అర్చక స్వాములు భౌతిక దూరాన్ని పాటిస్తూ విశేషార్చనలు జరిపించారని ఈవో రామారావు తెలిపారు.

Read More
నందీశ్వర స్వామికి విశేషపూజలు

నందీశ్వర స్వామికి విశేష పూజలు

సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోక కల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలో నందీశ్వరస్వామివారికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించింది. నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, , ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, ల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నందీశ్వరస్వామి వారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలు చేశారు. తర్వాత నానబెట్టిన శనగలు నందీశ్వర స్వామికి సమర్పించారు.

Read More
బయలు వీరభద్రస్వామికి అభిషేకం

బయలు వీరభద్రస్వామికి అభిషేకం

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామి వారికి మంగళవారం విశేషపూజలు జరిపించారు. బయలు వీరభద్రస్వామి వారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడిగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎలాంటి ఆచ్చాదన, ఆలయం లేకుండా దర్శనమిస్తాడు. ప్రసన్నవదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా […]

Read More
సెంచరీ కొట్టిన ప్లాస్మాదాతలు

సెంచరీ దాటిన ప్లాస్మాదాతలు

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోందని, ఇందుకు ప్లాస్మాదాత సహకారం ఎంతో ఉందని సెట్కూరు సీఈవో నాగరాజు నాయుడు అన్నారు. వైరస్‌ బారినపడి కోలుకున్న వారికి అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ ​అయ్యారని, ప్లాస్మాదాతల సంఖ్య రోజురోజుకు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్లాస్మాదానంతో ఎందరో ప్రాణాలను కాపాడిన వారవుతారని, ధైర్యంగా ముందుకు రావాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, జేసీ రవిపట్టాన్‌ శెట్టి ఇచ్చిన పిలుపుతో దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని అన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలలోని […]

Read More
‘గిఫ్ట్​స్మైల్’ పిలుపునకు విశేష స్పందన

‘గిఫ్ట్​స్మైల్’ పిలుపునకు విశేష స్పందన

సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన జన్మదిన సందర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్​స్మైల్​’ పిలుపునకు స్పందించిన పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోవిడ్ రెఫరెన్స్ అంబులెన్స్ వాహనా​లను ఇవ్వడానికి ముందుకొచ్చారు. మంగళవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో 8 కొత్త అంబులెన్స్ ​సర్వీసులను జెండా ఊపి మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రులు మల్లారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహబూబ్​నగర్​ ఎంపీ మన్నె శ్రీనివాస్ […]

Read More
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రులు

సీఎం కేసీఆర్ ను ​కలిసిన మంత్రులు

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రులుగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్తమ సేవలు అందించి ప్రజల అభిమానం చూరగొనాలని సీఎం ఆకాంక్షించారు.

Read More
ఉత్తమ టీచర్లకు ఘనసన్మానం

ఉత్తమ టీచర్లకు ఘనసన్మానం

సారథి న్యూస్, బిజినేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం డీఈవో గోవిందరాజులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మండలంలోని వట్టెం బాలుర ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయిని కల్పనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.భాస్కర్​రెడ్డి, టీచర్లు ఝాన్సీ, సురేష్​ పాల్గొన్నారు.

Read More
గర్భిణులు పోషకాహారం తీసుకోవాలే

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలే

సారథి న్యూస్, మెదక్: గర్భిణులు, బాలింతలను రక్తహీనత నుంచి కాపాడేందుకు ప్రభుత్వం పోషక పదార్థాలు అందిస్తోందని మెదక్ ​జిల్లా అడిషనల్​ కలెక్టర్ నగేష్ ​అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్​లో పోషణ్​ అభియాన్ ​కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్​వాడీ కేంద్రాలు, టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనతపై మహిళా సంఘాలు, అంగన్​వాడీ టీచర్లు, టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒక్కరూ తాము తీసుకునే ఆహారపు […]

Read More