Breaking News

Day: August 20, 2020

ఏపీలో 9,393 కరోనా కేసులు

ఏపీలో 9,393 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 9,393 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 3,25,396 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారినపడి 95 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,001గా నమోదైంది. 24 గంటల్లో 55,551 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజాగా వైరస్‌ బారినుంచి 8,846 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారు 2,35,218 మంది ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 973, చిత్తూరు 836, ఈస్ట్​గోదావరి 1357, […]

Read More
శ్రీశైలానికి సీఎం జగన్​

శ్రీశైలానికి సీఎం జగన్​

సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఇప్పటికే పదిగేట్లను ఎత్తివేసి నాగార్జునసాగర్​జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రత, నీటి మట్టం, విద్యుదుత్పత్తి.. తదితర వాటిని పరిశీలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి ఆగస్టు 21న శుక్రవారం శ్రీశైలం రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్​లో శ్రీశైలంలోని సున్నిపెంట హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడి నుంచి జెన్​కో […]

Read More
శ్రీశైలం పదిగేట్ల ఎత్తివేత

శ్రీశైలం పదిగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్​, జూరాలను తాకుతూ ఉరకలేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గురువారం సాయంత్రం రిజర్వాయర్​10 గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జున​ సాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగుల మేర ఉంది. అలాగే రిజర్వాయర్​ నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, […]

Read More
వరంగల్​లో మళ్లీ వర్షాలు

వరంగల్​లో మళ్లీ వర్షాలు

వరంగల్​: వరంగల్​ నగరాన్ని వర్షం వీడడం లేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి హన్మకొండలో భారీవర్షం కురిసింది. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. భారీవర్షాలతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముంపు ప్రాంతాల కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Read More
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, కర్నూలు: కరోనాపై యుద్ధంలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా ఉంటూ కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు ఎస్పీ డాక్టర్​ ఫక్కీరప్ప అన్నారు. కరోనా బారినపడి మృతిచెందిన పోలీస్​ హెడ్​కానిస్టేబుల్​ ఎస్​ఏ మాలిక్​బాషా కుటుంబసభ్యులకు 1993 బ్యాచ్​ పోలీసులు సేకరించిన రూ.లక్ష సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ నుంచి వచ్చే బెనిఫిట్స్​ త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More
రామలింగారెడ్డి మృతి కలిచివేసింది

రామలింగారెడ్డి మృతి కలిచివేసింది

సారథి న్యూస్​, సిద్దిపేట: దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి టి.హరీశ్​రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన లేకుండా ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తుందని అనుకోలేదని విచారం వ్యక్తంచేశారు. గురువారం దుబ్బాక అసెంబ్లీ నియోజవర్గంలోని దౌల్తాబాద్ వీటీటీ ఫంక్షన్ హాల్ లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. అంతుకుముందు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి […]

Read More
కరోనాకు ఏకైక మందు ధైర్యమే

కరోనాకు ఏకైక మందు ధైర్యమే

సారథి న్యూస్​, హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్‌ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా నడుచుకోవాలని కోరారు. ‘అమెరికా లాంటి దేశం కరోనాతో విలవిల్లాడుతుంటే మనం సమన్వయంతో ఎదుర్కొంటున్నాం. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నాడు. […]

Read More
ములుగు.. జలసంద్రం

ములుగు.. జలసంద్రం

మేడివాగులో ఇద్దరు మత్స్యకారుల గల్లంతు హైవేపైకి చేరిన రామప్ప సరస్సు నీరు సారథి న్యూస్​, ములుగు: ములుగు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో జిల్లా జలసంద్రంగా మారింది. జిల్లాలోని జంగాలపల్లి గ్రామం వద్ద హైవేపైకి రామప్ప సరస్సు నీరు చేరుకోవడంతో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి ములుగులోనే నిలిపివేస్తున్నారు.ఇద్దరు గల్లంతుజంగాలపల్లి వద్ద నేషనల్​ […]

Read More