ఢిల్లీ: మనదేశ శక్తిని ప్రపంచానికి ప్రపంచానికి చాటాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానిమోడీ శనివారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఏర్పాటుచేసిన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుంది. మనం కూడా కరోనాతో రాజీలేని పోరాటం చేస్తున్నాం. కరోనాపై పోరాటంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న కరోనా వారియర్స్‌కు (డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది, […]
పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.