ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 13, 28,336 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46,121 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు 67.6 శాతం రికవరీ రేటు ఉందని కేంద్ర వైద్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కరోనాతో 40, 699 మంది మృతిచెందగా, 5,95,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో మందిరం నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగోళీని ట్వీట్ చేశారు. ఒక చిన్న గుడి ముందు ముగ్గుతో శ్రీరామ్ అని రాసిన ముగ్గు ఫొటోను ఆమె ట్వీట్ చేశారు. ‘చాలా ఇళ్లలో ప్రతిరోజు రంగోళీ, కోలమ్‌ను వేస్తారు. బియ్యంపిండితో ప్రతి రోజు ఫ్రెష్‌గా వేసుకుంటారు. మా ఇంటి దగ్గరలోని ఒక చిన్నగుడిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇలా వేశారు’ అని మంత్రి ట్వీట్ చేశారు. […]
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన పూజ నిర్వహించారు. రాముడు మంచి లక్షణాలు కలిగిన అభివ్యక్తి అని వర్ణించారు. ‘రాముడు అంటే ప్రేమ, అసహ్యంగా కనిపించరు. రాముడు అంటే కరుణ, ఇది ఎప్పుడూ క్రూరంగా అనిపించదు, రాముడు అంటే న్యాయం, ఎక్కడా అన్యాయంలో కనిపించడు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మొదటి నుంచి […]
సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. రామలింగారెడ్డికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 25 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రజాసమస్యలు, […]