Breaking News

Month: July 2020

వ్యవసాయం సంస్కృతిలో భాగం

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సంస్కృతిలో వ్యవసాయం ఓ భాగమని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రైతువేదిక భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి గంగుల కమాలకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజ, కలెక్టర్ శశాంక, గ్రంథాలయసంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి, […]

Read More

అక్రమ బదిలీలు ఆపండి

సారథిన్యూస్​, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్​జీవన్​ డివిజన్​లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. […]

Read More

జాగ్రత్తలతో కరోనాను జయిద్దాం

సారథి న్యూస్, వాజేడు: భౌతికదూరం పాటించడం, నిరంతరం చేతులను శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించి కరోనాను జయించాలని వాజేడు ఎంపీపీ శారద సూచించారు. శనివారం ములుగు జిల్లా వాజేడు మండలం ఆరుగుంటపల్లిలో ఆమె వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్​ మంకిడి వెంకటేశ్వర్​రావు , హెచ్​ఎస్​ కోటిరెడ్డి, హెచ్​ఏ శ్రీనివాస్​, ఆశాకార్యకర్తలు, అంగన్​వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More

నిరాడంబరంగా బండి సంజయ్​ జన్మదినం

సారథిన్యూస్​, కొత్తగూడెం: బండి సంజయ్​ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్​ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్​ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్​, కేక్​ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్​రెడ్డి, నాయకులు, […]

Read More
బాలీవుడ్ బొమ్మ.. కంగనా రనౌత్

బాలీవుడ్ బొమ్మ.. కంగనా రనౌత్

సినిమాల్లో ఎంత ఇన్టెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతే వివాదాలు సృష్టిస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం కోలీవుడ్​లో ఏఎల్​విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. గతేడాది కంగనా నటించిన ‘మణికర్ణిక’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా డబ్బింగ్ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజై మంచి గుర్తింపు సాధించింది. కంగనా రాణి ఝాన్సీగా అందరినీ మెప్పించింది. దాంతో అచ్చు కంగనా రూపంతో బొమ్మలు తయారు చేశారు ఓ కంపెనీవారు. […]

Read More

‘దిశ’ మారింది

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్​వరుణ్ తేజ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ లో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ భామ దిశా పటాని. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. తర్వాత దిశకు తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో నేటివ్ అయిన బాలీవుడ్​కు వెళ్లింది. అక్కడ ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ధోని’ చిత్రంలో సుషాంత్ సరసన నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి అక్కడ. దాంతో టాలీవుడ్ వైపు […]

Read More
మెరిట్‌ బేస్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌: ట్రంప్​

అమెరికాలో మెరిట్‌ బేస్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌

వాషింగ్టన్‌: మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను ఏర్పాటుచేసేలా కార్యనిర్వాహక ఉత్తర్వులను తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కృషి చేస్తున్నారని వైట్‌హౌస్‌ చెప్పింది. టెలిముండో న్యూస్‌ చానెల్‌కు ట్రంప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్మిగ్రేషన్‌పై మాట్లాడిన తర్వాత వైట్‌హౌస్‌ ఈ ప్రకటన వెలువరించింది. డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌‌ చైల్డ్‌ హుడ్‌ అరైవల్స్‌(డీఏసీఏ) ప్రోగ్రామ్‌ కింద పౌరసత్వానికి మార్గం ఏర్పడుతుందని ట్రంప్‌ చెప్పారు. ‘అది చాలా పెద్ద, మంచి బిల్లు కానుంది. మెరిట్‌ ఆధారిత బిల్లు, దాంట్లో డీఏసీఏ కూడా […]

Read More

ఇద్దరు చైన్​ స్నాచర్స్​ అరెస్ట్​

  • July 11, 2020
  • CHAIN SNACHERS
  • Comments Off on ఇద్దరు చైన్​ స్నాచర్స్​ అరెస్ట్​

సారథిన్యూస్, రామడుగు: ఒంటరి మహిళలను టార్గెట్​ చేసుకొని చైన్​స్నాచింగ్​ పాల్పడుడుతున్న ఇద్దరు దొంగలను రామడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 51 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ రమేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన వేముల రమేశ్​(23), వేముల నర్సింహులు(19) జల్సాలకు అలవాటుపడి చైన్​స్నాచింగ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎస్సై అనూష రామడుగు చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా వీరిద్దరు అనుమానస్పదంగా […]

Read More