Breaking News

Month: July 2020

రైతులను ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా నారాయణపుర్ రిజర్వాయర్ ను బుధవారం టీడీపీ బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ.. నారాయణపూర్​ రిజర్వాయర్ నింపి రైతులను ఆదుకోవాలని.. భూములు , ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జంగం అంజయ్య, నేతలు కరుణాకర్​రెడ్డి, జెల్లోజి శ్రీనివాస్​, పూరెల్ల గంగరాజుగౌడ్​, అనుపురం వెంకటేశ్​గౌడ్​, భూపతి తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రజాగాయకుడు నిస్సార్​ మృతి

సారథిన్యూస్​, హైదరాబాద్​: నయా గద్దర్​, తెలంగాణకు చెందిన ప్రజాగాయకుడు సుద్దాల నిస్సార్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. నిరుపేదల ముస్లిం కుటుంబంలో జన్మించిన నిస్సార్​.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్​ యూనియన్​ నేతగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా నిస్సార్​ వ్యవహరించారు. నిస్సార్​ మృతికి రాష్ట్ర మంత్రి హరీశ్​రావు, ఆర్టీసీ యూనియన్​ నేత రాజిరెడ్డి, సీపీఐ నాయకుడు […]

Read More

హోంక్వారంటైన్ లోకి ​జార్ఖండ్​ సీఎం

రాంచీ: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ రాష్ట్ర మంత్రి మిథిలేశ్​ ఠాకూర్​, పార్టీ ఎమ్మెల్యే మథుర మహకు కరోనా పాజిటివ్​ రావడంతో సోరెన్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే తాను స్వీయనిర్బంధంలోకి వెళుతున్నానని హేమంత్​ సోరెన్​ ట్వీట్​ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు హోంక్వారంటైన్​కు వెళ్లాలని ఆయన కోరారు. తాను ఇంటినుంచే ముఖ్యమైన పనులు నిర్వహిస్తానని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన […]

Read More
కొత్త సచివాలయం.. ఇదిగో డిజైన్​

కొత్త సచివాలయం.. ఇదిగో డిజైన్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ఊపందుకున్నాయి. కొత్త సెక్రటేరియట్​ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే నిర్మాణ సంస్థలు డిజైన్లను కూడా రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సచివాలయ భవన నిర్మాణం దీర్ఘ చతురస్రాకారంలో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చ. అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. భవనానికి అత్యంత విశాలంగా 2 మీటర్ల మేర ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ద్వారం మధ్యలో తెలంగాణ కలికితురాయిలా ఓ […]

Read More
అభివృద్ధి పనులకు శ్రీకారం

అభివృద్ధి పనులకు శ్రీకారం

సారథి న్యూస్, కడప: ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్​రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆర్‌జీయూకేటీ, ఆర్‌కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త ఎకడమిక్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు‌ […]

Read More
కీర్తిసురేష్​ వాయిదాల పద్ధతి

కీర్తి సురేష్.. వాయిదాల పద్ధతి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన జోడీ కట్టనుంది కీర్తి సురేష్. ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్​గా కమిటైన కీర్తి ఈ చిత్రంలో బ్యాంక్ ఎంప్లాయిగా కనిపించనుందట. అందుకోసం బ్యాంకులకు సంబంధించిన రుణాలు.. వాయిదాలు..వడ్డీ రేట్లు.. వార్షిక లావాదేవీలు మొదలైన అంశాలను ఔపాసన పట్టే పనిలో పడిందట కీర్తి. బ్యాంక్ మోసాల బ్యాక్ డ్రాప్​లో ఈ సినిమా కథ ఉంటుందని.. మహేష్ బాబు ఒక […]

Read More

ఇలాచేస్తే దగ్గు మాయం

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూసే పరిస్థితి నెలకొన్నది. సాధారణ దగ్గొచ్చినా కరోనా ఏమోనని అందరూ తెగ ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో మాములు దగ్గు, జలుబుకు ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు వస్తే డాక్టర్​ను సంప్రదించడం మేలు. కానీ సాధారణ దగ్గును తగ్గించుకొనేందుకు మాత్రం కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు. అవి ఏమిటో చూద్దాం..అల్లం దివ్య ఔషధంగ్లాసు నీటిలో అర […]

Read More

అరటి.. అద్భుత ఔషధం

అరటిపండులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. అరటిలో ఎన్నో రకాలున్నాయి. చెక్కరకేళి, దేశవాళీ, బొంత, కర్పూర, పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి.. వీటిలో ఏవీ తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అజీర్తి సమస్య పోవాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతూ చెప్తుంటారు పెద్దలు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై […]

Read More