Breaking News

ఇలాచేస్తే దగ్గు మాయం

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూసే పరిస్థితి నెలకొన్నది. సాధారణ దగ్గొచ్చినా కరోనా ఏమోనని అందరూ తెగ ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో మాములు దగ్గు, జలుబుకు ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు వస్తే డాక్టర్​ను సంప్రదించడం మేలు. కానీ సాధారణ దగ్గును తగ్గించుకొనేందుకు మాత్రం కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు. అవి ఏమిటో చూద్దాం..
అల్లం దివ్య ఔషధం
గ్లాసు నీటిలో అర టీ స్పూన్ అల్లం తరుము, కొద్దిగా టీ పౌడర్, మూడు తులసి ఆకులు వేసి సుమారు పది నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవం చల్లారిన తరువాత తాగితే గొంతులో గరగరతో పాటు దగ్గు తగ్గుతుంది. పొడి దగ్గు..ఛాతిలో పట్టినట్టు ఉంటే మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు పొడి చేసి కలిపి 15 నిమిషాలు మరగబెట్టి దింపాలి. ఈ మిశ్రమంలో చెంచాడు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి.
దీర్ఘకాలంగా దగ్గు ఉంటే..
దీర్ఘకాలికంగా దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే భవిష్యత్తులో కరోనావైరస్ తగ్గాక పాటించేందుకు ఈ చిట్కా పనికి వస్తుంది. గ్లాసు నీటిలో మూడు మల్బరీ ఆకులను వేసి పది నిమిషాలు మరగబెట్టాలి. ఇందులో ఎగ్ వైట్ మిక్స్ చేసి తాగాలి.
గొంతు గరగర తగ్గాలంటే..
లవంగాలు చప్పరిస్తే గొంతులో గరగర తగ్గుతుంది. దాంతో పాటు పాలలో పసుపు వేసుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. ఈ చిట్కాలు ఉపశమనం కలిగించవచ్చు కానీ వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. కరోనావైరస్ సంక్రమిస్తున్న సమయంలో దగ్గు, జలుబు, జ్వరం, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను వెంటనే సంప్రదించడం ఉత్తమం.