సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో 50 పడకల దవాఖానకు ఎప్పడు కడతారని బీజేపీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్‌లో 50 పడకల దవాఖాన కడతామని మూడేండ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది వచ్చినా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, విద్యాసాగర్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యావేత్తలు, విషయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుందాం విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికడదాం యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలు పాటించాలి ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్కూళ్లను ప్రారంభించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు […]
సారథిన్యూస్, హైదరాబాద్: విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంపీపీ గడిపె మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులున్నారని చెప్పారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేతపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదావేసింది. ఈ విషయమై దాఖలైన పిల్‌పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా? లేదో చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు కోరింది. ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జిమెంట్కాపీలను ఏజీ సమర్పించారు. భవనాల కూల్చివేతకు ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని […]
సారథి న్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరగ్రామంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్‌ను దేవాలయ భూముల పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు నర్సింహాపురం గ్రామంలోని కోదండరామ స్వామి దేవాలయం భూములు సర్వే చేయించాలని వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సర్వేకు ఇబ్బంది అవుతుందని త్వరితగతిన అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సర్వే చేయించి దేవాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సమితి గౌరవ సలహాదారులు వేమూరి సత్యనారాయణ, అధ్యక్షుడు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు చెందిన రాజగృహంపై దాడులు చేయడం అమానుషమని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్ సదన్ మహారాజ్ పేర్కొన్నారు. గురువారం దళితసంఘాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ముంబై నగరంలో ఉన్న అంబేద్కర్ చారిత్రక నివాస గృహంపై కొంతమంది ఉన్మాదులు దాడి చేయడం రాజ్యాంగ విలువలను […]
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. భారీ పారితోషికాన్ని అందుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. నయన్ దాదాపు ఇండస్ట్రీకొచ్చి పన్నెండేళ్లు దాటుతోంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది నయనతార. రాను రానూ క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న నయన్ పేరు ప్రేమ, పెళ్లి విషయాల్లో అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తోంది. అయితే నయన తార ఓ సినిమా చేశాక ఆ చిత్ర ప్రమోషన్‌కు కానీ, […]