తమ టీంలో ఎవరికీ కరోనా సోకలేదని రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశాడు. ‘నా టీంలో ఒకరికి కరోనా సోకిందని దాంతో మేము షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశామని.. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు’ అని వర్మ ట్విట్టర్ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చాడు. కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ వర్మ వరుస సినిమాలు చేస్తూ లాభాలు దండుకుంటున్నాడు. క్లైమాక్స్, నగ్నం చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా 12 క్లాక్ అంటూ హారర్ […]
కీర్తిసురేశ్ తాజాగా నటిస్తున్న ‘మిస్ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో తెలియజేశాడు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరికొన్ని సాంగ్స్ సిద్ధమవుతున్నాయని తమన్ తెలిపారు.
సారథి న్యూస్, మునగాల: క్రషర్ మిల్లులో రాత్రి వేళ నిర్వహిస్తున్న బ్లాసింగ్‌లు ఆపాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న క్రషర్ మిల్లులో యాజమాన్యం తరచూ రాత్రి వేళ పెద్ద ఎత్తన బ్లాస్టింగ్లు జరుపుతున్నారు. దీంతో స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం క్రషర్ మిల్లు యాజమాన్యం బ్లాసింగ్‌లు ఆపాలంటూ వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెరుగుతున్న డీజిల్ ధరలు రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది. వ్యవసాయంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం భారీగా పెరిగి పోయింది. సాగు పనులకు కూలీల కొరత వేధిస్తుండడంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికొచ్చే వరకు కీలకంగా మారాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా […]
సారథి న్యూస్, పెద్దపెల్లి: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పదిరోజుల్లో 43 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో ఆరుగురు ఇప్పటికే మృతిచెందారు. మరో ఆరుగురు ఆరోగ్యం నిలకడగా ఉండి కోలుకున్నారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం లాక్ డౌన్లో సడలింపు విధించడంతో జిల్లా అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో గుంపులు గుంపులుగా తిరుగుతూ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో […]